header

Karwar / కార్వార్

Karwar / కార్వార్

భారతదేశం పడమటి తీరంలో ఉన్న గోవా నుండి 15 కిలో మీటర్లు, కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నుండి 520 కిలో మీటర్ల దూరంలో కార్వార్ పట్టణం ఉంది. కార్వార్ సహజమైన ఓడరేవు. సమీపంలోని కేరళ రాష్ట్ర సుగంధ ద్రవ్యాల ఎగుమతులు ఇక్కడ నుండే జరుగుతాయి. గతంలో పోర్చుగీస్, తర్వాత బ్రిటీష్, ఆ తర్వాత అరేబియన్లు, ఇపుడు ఇండియా నౌకాదళం ఈ ఓడరేవును ఎంతో లాభసాటిగా ఉపయోగించుకుంటున్నాయి.
కాళి రివర్ కార్వార్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే సదాశివగౌడ కోట కూడా ఉంది. కాళీ రివర్ వంతెన పక్క కట్టబడింది. ఈ నది, బ్రిడ్జి, కోట, కన్నులకింపైన కొబ్బరి చెట్లు మొదలైన సుందర అందాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి.
కార్వార్ పట్టణంలో ముస్లింలు, క్రిస్టియన్ల సంఖ్య అధికం.
ఒకప్పుడు టిప్పు సుల్తాన్ ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఇది గోవాకు సమీపంలో ఉండటం చేత, పోర్చుగీస్ మరియు బ్రిటీష్ పాలన సమయంలో అనేక మంది మతపర సంస్ధల వారు కూడా ఇక్కడకు వచ్చేవారు. ఇక్కడి ప్రజలలో 55 శాతంమంది కొంకణి భాష మాట్లాడతారు. కన్నడం వీరికి రాదు. వీరి వేష భాషలు గోవా ప్రజల వేష భాషలకు దగ్గరగా ఉంటాయి. దేశం మొత్తంలో ఇది మాత్రమే కొంకణ్ రాష్ట్రంగా చెప్పవచ్చు. కాని వీరు కర్నాటకలో భాగంగా ఉండటానికే ఇష్టపడతారు.

కొబ్బరి చెట్లు, సరుగుడు చెట్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉండి పర్యాటకులకు స్వర్గాన్ని తలపిస్తాయి. జల క్రీడలు ఈత, స్నోర్ కెలింగ్, సర్ఫింగ్ డైవింగ్ వంటివి కార్వార్ బీచ్ లైన దేవ్ బాగ్, కూడి, కాజు బాగ్ లలో ప్రసిద్ధి చెందినవి. దీనితో పర్యాటకులకు ఇది ఒక సాహస క్రీడల కేంద్రంగా మారింది.
ఈ ప్రాంతంలో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రాచీన హస్తకళలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి దేవాలయాలలో ఎంతో శిల్పకళా నైపుణ్యం కనపడుతుంది.
గత దశాబ్దంలో భారత నౌకాదళం తన స్ధావరాన్ని ఏర్పరచుకొంది. ఓడరేవులోకి ప్రజలను భధ్రతా కారణాలుగా అనుమతించటంలేదు. అయితే, ప్రతి సంవత్సరం నేవీ వీక్ లో మాత్రం నౌకాదళ సైనికులు ఈ సమయంలో ప్రజలను లోనికి అనుమతిస్తారు. అందమైన ఓడరేవును ఆనందించేందుకు అపుడు వీలు కలుగుతుంది. అనేక శతాబ్దాలనుండి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలనుండి కార్వార్ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Karwar / కార్వార్

English version will be published soon............................................. ..................... ........................ ........................... ............................ ................. ............... ........................ .................................... .......................... .............. .................................... ............................................. ..................... ........................ ........................... ............................ ................. ............... ........................ .................................... .......................... .............. .................................... < .......................... .............. .................................... .......................... .............. ....................................