

కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే ఊరిలో కుక్కే సుబ్రమణ్య స్వామి దేవాలయం వుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగ దేవతగా ఆరాధించడం విశేషం. ఇది ఒక ప్రసిద్ధ పుణ్యస్థలం.
వాసుకి శివుడిని ప్రార్ధించి, గరుత్మంతుడి నుంచి నాగజాతిని కాపాడమని వేడుకున్న ప్రదేశంలో ఈ గుడి నిర్మించారని పురాణ గాధ వలన తెలుస్తుంది. ఈ తపస్సుకు మెచ్చిన శివుడు సుబ్రహ్మణ్య స్వామిని నాగజాతిని రక్షించడానికి పంపాడు, అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామిని నాగ జాతి రక్షకుడిగా కొలుస్తున్నారు.
గరుత్మంతుడి గోపురం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ వెండి గోపురాన్ని వాసుకి బుసల్లోంచి వచ్చే విషవాయువుల నుంచి భక్తులను కాపాడడానికి నిర్మించారు. వాసుకి ఈ గుళ్ళో వుంటాడని నమ్ముతారు. ఈ గుళ్ళో జరిగే ప్రధాన పూజలు ఆశ్లేష బలి, సర్ప సంస్కారం
కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయానికి విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు. మంగళూరు దగ్గరలోని విమానాశ్రయం. ఈ గుడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు, మంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం వరకు చాలా ప్రభుత్వ రంగ బస్సులు అందుబాటులో వున్నాయి.