header

Malphe / మాల్పే

Malphe / మాల్పే
మాల్పే ఒక సుందరమైన సముద్రతీర పట్టణం. దేవాలయాల పట్టణంగా పేరుపొందిన ఉడిపి నుండి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్నది. ఇది ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఓడరేవు. ఈ ప్రాంతం ఉద్యావన నదీ తీరాలలో ఉండటం చేత మనోహరమైన వినోద యాత్రా స్ధలంగా పేరుపొందింది.
మాల్పే అద్భుత ద్వీప సముదాయం. ఇది అగ్నిపర్వతం బద్దలవడంతో తీరం వెంబడి ఏర్పడ్డాయి. వీటిలో సెయింట్ మేరీ ద్వీపాలు పర్వతం నుండి లావా వెదజల్లబడి కొన్ని యుగాల క్రిందటే చక్కటి రాతి ద్వీపాలుగా ఏర్పడ్డాయి.
భారతదేశంలోని ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలలో మాల్పే కూడా ఒకటి. ఈ ప్రాంతం, భూగర్భ శాస్త్రవేత్తలను అధికంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో ఇతర ఆకర్షణలలో బలరామ మరియు అనంతేశ్వర దేవాలయాలు. వీటిలోని ఒక ద్వీపంలో ఒక కోట ఉంది. ఈ కోటను బసవప్ప నాయకర్ చేత కట్టించబడినదని చెపుతారు. మాల్పేను చూడాలనుకుంటే, ఫెర్రీ లేదా బోట్ ద్వారా సెయింట్ మేరీ ద్వీపాలకు వెళ్ళవలసి ఉంటుంది. బంగారు ఇసుక తిన్నెలు, ఆకర్షణీయమైన బీచ్, కొబ్బరి చెట్లు, ప్రశాంతమైన సరస్సులు కను విందు చేస్తాయి.
కెరటాలు బాగా ఎత్తుగా వచ్చినపుడు కూడా తీరం వెంబడి బోటులో సుమారు 10 కిలోమీటర్లవరకు ప్రయాణించవచ్చు. నిలకడగా ఉండే ఈ నీటిలో మునిగి పోతామన్న భయం లేకుండా చక్కగా ఈత కొట్టవచ్చు.
ఈ ప్రాంతంలో చేపల వేట మాత్రమే కాక, టైల్స్ తయారీ, కొబ్బరి చెట్ల సాగు కూడా మాల్పే ప్రజలకు జీవనోపాధిగా ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రధానంగా పర్యటనకు అనుకూలమైనది కావడంతో చాలామంది యాత్రికులతో సందడిగా ఉంటుంది. దీనితో పర్యాటక పరిశ్రమ బాగా అభివృధ్ధి చెందుతుంది. మాల్పేలో తుళు, కొంకణి, కన్నడ భాషలు మాట్లాడుతారు.
ఇక్కడ అనేక బీచ్ రిసార్టులు ఉన్నాయి. పర్యాటకులకు వీటిలో సౌకర్యాలున్నాయి. ఇది ఉడుపి పట్టణానికి సమీపంలో ఉండటం చేత ఎక్కడ కావాలన్నా బస చేయవచ్చు. ప్యారడైజ్ ఐల్ బీచ్ రిసార్ట్, మాల్పే బీచ్ రిసార్ట్, ఉడుపిలోని పామ్ గ్రోవ్ బీచ్ రిసార్ట్ వంటివి ఈ ప్రాంతంలో కొన్ని మంచి హోటళ్ళు.