

మరావంతే అందమైన బీచ్ లతో గల ఒక చిన్న పట్టణం. ఈ పట్టణానికి కుడిభాగంలో అరేబియా సముద్రం ఎడమ భాగంలో సౌపర్ణిక నది ఉన్నాయి. కుందాపుర వద్దనున్న ఈ తీరం ఉడుపి పట్టణానికి సుమారు 50 కి.మీ. దూరంలోను మరియు బెంగుళూరు నగరానికి 450 కి. మీ. దూరంలోను ఉన్నది.
ప్రశాంత జీవనం కోరేవారి మరావంతే ఒక స్వర్గం ఈ తీరాన్ని వర్జిన్ బీచ్ (కన్యత్వ బీచ్) అని పిలుస్తారు. దానికి కారణంఈ మొత్తం ఏ మాత్రం కలుషితం కాకుండా తెల్లటి ఇసుకతో ఉంటుంది. పర్యాటకులు ఎంతో ఇష్టపడే ఈ బీచ్ కొల్లూరు మరియు కొడచాద్రి కొండలకు సమీపంలో ఉన్నది. ఇక్కడినుండి జాతీయ రహదారి సుమారు 100 మీటర్ల దూరం మాత్రమే. బీచ్ ను చేరుకోవటం ఎంతో తేలిక.
బీచ్ లో కల అంతు లేని ఇసుక ప్రదేశం, చల్లటి సముద్రపు గాలి, తాటి చెట్లు వంటివి ఎంతో ప్రశాంతతనిచ్చి జీవితంలో మరువలేని మధుర అనుభూతులను మిగుల్చుతాయి. ఈ బీచ్ కు దక్షిణ భాగంలో ట్రాసి అనే ప్రదేశం మరోవైపునున్న సౌపర్ణిక నదికి ఆనుకుని పడుకొనే గ్రామం ఉంటుంది.
మరావంతే పట్టణంలో వేసవిలో చెమటలు అధికం. అయితే శీతాకాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే సెప్టెంబర్ నుండి మార్చి వరకు అనుకూలం. సముద్రంలో స్విమ్మింగ్ చేసి ఆనందించవచ్చు. తుళు మరియు కన్నడం భాషలు మాట్లాడతారు.
ఈ పట్టణానికి విమాన, రైలు, రోడ్డు రవాణా సదుపాయాలున్నాయి. సమీప విమానాశ్రయం మంగుళూరు మరియు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు. మంగుళూరు విమానాశ్రయం నుండి బస్సులలో లేదా టాక్సీలలో బీచ్ కు చేరవచ్చు. సమీప రైలు జంక్షన్ మంగుళూరు. కర్నాటకలోని ఇతర ప్రాంతాల నుండి బస్సులు, ప్రయివేటు వాహనాలు ద్వారా చేరుకోవచ్చు.