header

Sravana Belagola / శ్రావణబెళగొళ

Sravana Belagola / శ్రావణబెళగొళ
శ్రావణబెళగొళ పట్టణంలో ప్రవేశించే ముందే 17.5 మీటర్ల ఎత్తుగల గోమఠేశ్వర విగ్రహం దూరం నుండే కనపడుతుంది. ఎత్తైన ఈ విగ్రహం సుమారుగా క్రీ.శ 978 కాలం నాటికి చెందినది శ్రావణబెళగొళ పట్టణం జైన యాత్రా స్ధలం.
ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏక శిలా విగ్రహాలలో ఒకటి. విగ్రహమే కాక, శ్రావణబెళగొళ మరికొన్ని పూర్వ వైభవాలను కూడా చూపిస్తుంది. చంద్రగుప్త మౌర్యుడు ఎన్నో సంవత్సరాలపాటు రాజ్యపాలన చేసిన తరువాత శ్రావణబెళగొళ కొండలపై తన చివరి జీవితాన్ని గడుపుతాడు.
దక్షిణ భారతదేశంలో జైన మతం వ్యాప్తికి ఈ చంద్రగుప్తుడు ఎంతో కృషి చేశాడు. చరిత్రకారులకు ఈ పట్టణం సుమారు క్రీ.శ. 600 నుండి క్రీ.శ.1830 వరకు జరిగిన అనేక అంశాలకు సంబంధించిన శాసనాలు లభిస్తాయి. వివిధ వంశాల రాజులు గంగ, హొయసలలు, ఒడయార్లు గురించిన సమాచారం తెలియజేస్తుంది. లిఖిత రూపంలో ఉన్న ఈ గ్రంధాల వలన పురాతన యుగాల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
శ్రావణబెళగొళకు సమీప బస్ స్టేషన్ చెన్నరాయపట్న. బెంగుళూరు, మైసూర్ ల నుండి చెన్నరాయపట్నానకి బస్ లలో వెళ్లవచ్చు.