header

Srungeri / శృంగేరి

Srungeri / శృంగేరి
తుంగనది ఒడ్డునకల ప్రశాంత పట్టణమైన శృంగేరిలో జగద్గురువు ఆది శంకరాచార్య మొదటి మఠాన్ని స్ధాపించారు. అప్పటినుండి శృంగేరి ఒక యాత్రా స్ధలంగా మారింది. వేలాది భక్తులు వస్తూనే ఉంటారు.
శృంగేరి పట్టణం సమృద్ధిగా వనరులు గల ప్రదేశం. ఇది కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది. ఆది శంకరాచార్యులు శృంగేరి పట్టణానికి వచ్చినపుడు ఆ పట్టణంలో ఎంతో విశేషత ఆయనకు కనిపించటంతో తన మొదటి మఠాన్ని అక్కడ నిర్మించారు. తుంగ నది ఒడ్డున పర్యటించే సమయంలో ఆయన ఒక నాగుపాము తన పడగను విప్పి మండుటెండలో ఒక కప్పకు నీడనివ్వటం ఆయన కంటబడింది. శత్రువైన కప్పకు ఆ నాగుపాము చేసిన సేవకు శంకరాచార్యులు ఆశ్చర్యపోయారు. ఆ ప్రదేశం ఎంతో విశిష్టతగల ప్రదేశంగా ఆయన గుర్తించారు. నేడు శృంగేరి పట్టణంలో ఆయన స్ధాపించిన శారదా పీఠం ప్రతిరోజూ వేలాది భక్తులను ఆకర్షిస్తోంది.
శృంగేరిలో ఇంకా చూడదగిన ప్రదేశాలు విద్యాశంకర్ మరియు శారదాంబ దేవాలయాలు. విద్యా శంకర్ దేవాలయం 12 స్తంభాలకు ప్రసిద్ధి. వీటిని 12 రాశుల గుర్తులుగా చెపుతారు. ఈ దేవాలయాన్ని ఖగోళ సిద్ధాంతాలను అనుసరించి నిర్మించారు.
శృంగేరి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది.
మంగుళూరు శృంగేరి పట్టణానికి సమీప విమానాశ్రయం. శృంగేరి పట్టణం బెంగుళూరుకు 330 కి.మీ. దూరంలో ఉంది. సౌకర్యవంతమైన బస్ సర్వీస్ లలో మంగుళూరుకు వెళ్లవచ్చు. శృంగేరికి సమీప రైల్వే స్టేషన్లు, షిమోగా మరియు కడూర్ లు.