ఇడుక్కి, పర్యాటకులని అమితంగా ఆకట్టుకునే అధ్బుతం. దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు ఈ ప్రాంతం విశిష్టత. భారత దేశంలోనే అతి పెద్ద శిఖరమైన 'అనముడి' శిఖరం ఇడుక్కిలో ఉంది. అంతే కాదు, ప్రంపంచంలోనే రెండవ అతి పెద్ద వంపైన ఆనకట్ట కలిగిన ప్రాంతంగా ఇడుక్కి ప్రసిద్ది చెందింది. చేరా సామ్రాజ్యంలో భాగం కావటం, యూరోపియన్ నుండి ఇక్కడికి వచ్చిన ఎంతో మందికి నివాస స్థలం కావడం వల్ల ఇడుక్కి చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
యుగాల నుండి దేశ విదేశాలకు టేకు, ఎర్ర కలప, గంధం చెక్క, ఏనుగు దంతాలు మరియు నెమళ్ళు వంటివి ఎగుమతి చేయడానికి ఈ ప్రాంతం వ్యాపార కేంద్రంగా పేరుపొందింది.
జనవరి 26, 1972 లో జిల్లాగా గుర్తించబడిన ఇడుక్కి కేరళ లో నే రెండవ పెద్ద జిల్లా. దేవుకులం, అడిమలి, ఉడుంబన్చోళ, తేకడి, ముర్రిక్కడి, పీర్ మేడు మరియు తోడపుజ్హ వంటి ముఖ్య నగరాలని ఈ జిల్లా కలిగి ఉంది. తోడుపుజ్హయర్, పెరియార్ మరియు తలయ వంటి నదులు ఇడుక్కి జిల్లాలో ఉన్నాయి. 200 మీ ల కంటే ఎత్తు ఉన్న ఎన్నో శిఖరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
రాష్ట్ర వినియోగానికి అవసరమయ్యే జల విద్యుత్ శక్తిలో 66 శాతం అందించడం వల్ల ఇడుక్కిని కేరళ యొక్క విద్యుత్తు కేంద్రంగా పరిగణించవచ్చు. ఇడుక్కిలోని డ్యాం ల లో ఇడుక్కి ఆర్చ్ డ్యాం, కులమావు డ్యాం మరియు చేరుతోని డ్యాం ముఖ్యమైనవి. సుందరమైన ప్రదేశంలో ఉన్న ఈ ఆనకట్టలు పర్యాటకులని ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా, విండ్ ఎనర్జీ ఫార్మ్ ఉన్న రామక్కల్మేడు, ఇడుక్కి లోని ముఖ్యమైన కొండప్రాంతం. పర్యాటకులని బోటింగ్ మరియు ఫిషింగ్ ల కి అమితంగా ఆకట్టుకునే మలంకర రిజర్వాయర్ ప్రాజెక్ట్ కేరళలో అతి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్. వీటితోపాటు ఇడుక్కిలో మరెన్నో ఆకర్షణలు ఉన్నాయి.
సుందరమైన ప్రకృతి దృశ్యాలతో పాటు, అనేకమైన తేయాకు తోటలు, కాఫీ ప్లాంటేషన్స్, నిర్మలమైన వాతావరణం, మంత్రముగ్ధులని చేసే జలపాతాలు, వివిధ జంతువులు కలిగిన సాంచురీ లు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇడుక్కిలో పేరొందిన ప్లాంటేషన్ అయిన ముర్రిక్కడ్డి తేయాకు, కాఫీల పరిమళం గాలిలో నిండి ఉంటుంది. మిరియాలు, యాలకులను పండించే ప్రాంతంగా నేడుంకండం హిల్ ప్రసిద్ది. ప్రవహించే సెలయేళ్ళు సందర్సకులకు ఆహ్వానం పలుకుతాయి.
సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున్న మంగళ దేవి టెంపుల్ ఇడుక్కిలో ని ప్రధాన పర్యాటక ఆకర్షణ. వాడక్కుమ్కూర్ రాజా వారిచే ఈ కోవెల నిర్మించబడినదని నమ్మకం. అన్నామల గుడిని చోళుల నిర్మాణ శైలిలో కట్టారు. వాడక్కుమ్కూర్ రాజా వారిచే ముస్లిం సైనికుల కోసం నిర్మించబడిన నిన్నర్ మసీదు, ప్రాచీన కోటల యొక్క అవశేషాలు కరిక్కోడ్ ప్రాంతంలో గమనించవచ్చు. 13 వ శతాబ్దం ముందు నుండి తోడుపుజ్హ లో ఉన్న ఒక పురాతన మైన చర్చ్ ని కూడా ఇక్కడ గమనించవచ్చు. తేకడి లో ప్రఖ్యాతమైన పెరియార్ నేషనల్ పార్క్ ఉంది.
కురింజిమల సాంచురి , అరుదైన వృక్ష మరియు జంతు జాతులకి స్థావరం. దీని సమీపంలోనే చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంచురి, ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురి, అనముడి షోలా నేషనల్ పార్క్, ఎరావికులం నేషనల్ పార్క్ మరియు పంపాడుం షోల నేషనల్ పార్క్ లు ఉన్నాయి. నీలగిరి తహర్, నీలగిరి వుడ్ పిజియన్, గౌర్, పర్పెల్ ఫ్రాగ్ టైగర్, గ్రిజ్జ్లేడ్ జైంట్ స్క్విరెల్, ఏనుగు, సాంబార్ డీర్ మరియు నీలకురింజిలని చూడడానికి ప్రపంచంలో నలు మూలల నుండి పర్యాటకులు వస్తారు.
తట్టేకాడ్ బర్డ్ సాంచురి లేదా సలీం అలీ బర్డ్ సాంచురి ఎన్నో రకాల పక్షులకి అలాగే వివిధ రకాల దేశీయ జంతువులకి నివాసం. పెనిన్సులర్ బే ఓల్, మలబార్ గ్రే హార్న్ బిల్, రోజ్ బిల్డ్ రోలర్, క్రిమ్సన్ త్రోటెడ్ బార్బర్, క్రేస్టేడ్ సేర్పెంట్ ఈగల్, గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ మరియు ఫెయిరీ బ్లూ బర్డ్ వంటి అంతరించిపోతున్న పక్షులు ఎన్నింటినో ఇక్కడ చూడవచ్చు. కల్వరి పర్వతం, పల్కులమేడు మరియు నేడుంకందం కొండలు పర్వతారోహణ, సాహస యాత్రల మీద ఆసక్తి కలిగిన వారు తప్పక సందర్శించవలసిన ప్రాంతాలు. హిల్ వ్యూ పార్క్, తుంపచి కాల్వేరి సముచయం మరియు పైనవు వంటివి మరికొన్ని పర్యాటక ఆకర్షక ప్రదేశాలు.