header

Kochi Tourism / కొచ్చి పర్యాటకం...

Kochi Tourism / కొచ్చి పర్యాటకం...
భారత దేశంలోనే అతి పెద్ద రేవు పట్టణమైన కొచ్చి(లోగడ కొచ్చిన్) ఎర్నాకుళం జిల్లాలో ఉంది. కొచ్చు అజ్హి అంటే చిన్న సరస్సు అని అర్ధం. ప్రాచిన పర్యాటకుల రచనలలో ఎక్కువగా కొచ్చి అనే నగరంగానే వర్ణించబడింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇష్టపదే ప్రాంతం కొచ్చి. చాలామంది పోర్చుగీసు వారు కొచ్చిలో స్థిరపడ్డారు. వారు తమ సొంత ప్రదేశంగా కొచ్చిని తలుస్తారు ప్రాచిన మరియు పాశ్చాత్య కలయికల మిశ్రమమే కొచ్చి నగరం. భారత దేశపు సంస్కృతి, పాశ్చాత్య ప్రభావం, రెండింటి కలయిక కొచ్చి నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. కొచ్చి సాంస్కృతిక చరిత్ర......
14 వ శతాబ్దంలో కొచ్చి నగరం పేరులోకి వచ్చింది. అప్పటినుండి, చారిత్రక పుస్తకాలలో ఈ రేవు పట్టణం గురించి పర్యాటకులు ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఆహార పదార్ధాల వ్యాపారానికి, ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు మరియు మూలికల వ్యాపారానికి ఈ పట్టణం పేరు గాంచినది. యూదులు, చైనీయులు, గ్రీకులు, అరబ్బులు, పోర్చుగీసులు, మరియు రోమన్ వర్తకులు సుగంధ ద్రవ్యాలని కొనడానికి ఈ పట్టణానికి వచ్చేవారు. అలాగే, వారి వస్తువులతో వ్యాపారం చేసుకునేవారు. దాని ఫలితంగా, వివిధ సంస్కృతుల పద్ధతులు ఇక్కడి స్థానిక ప్రజల జీవన విధానంలో విలీనం అయ్యాయి.
భోజన ప్రియుల స్వర్గం కొచ్చి.....
పర్యాటకులకు నోరూరించేలా అద్బుతమైన ఆహారాన్ని ఇక్కడి రెస్టారెంట్లు మరియు హోటళ్ళు అందిస్తాయి. ప్రపంచంలోని ఏ మూల నుంచి మీరు వచ్చినా మీ దేశంలో లభించే స్థానిక వంటకాల రుచి కొచ్చి మీకు అందిస్తుంది. అదే కొచ్చి ప్రత్యేకత.
శాఖాహార మరియు మాంసాహార రుచికరమైన పదార్ధాలను స్థానిక వంట మనుషులు నోరూరించే విధంగా రుచికరంగా వండుతారు. అరటి ఆకులో చుట్టిన చేపల వంటకాన్ని రుచి చూడవలసిందే
పర్యాటక ప్రదేశాలు చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, మ్యూజియమ్స్, పిల్లల కోసం పార్కులు , షాపింగ్ కోసం మాల్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. వృక్ష జాలం మరియు జంతు జాలం ఉండే వన్యమృగ ఉద్యానవనాలు మరియు సాంక్ట్చురీస్ ప్రకృతి ప్రేమికులను నిరాశపరచవు. అత్తిరపల్లి జలపాత సందర్శనలో ప్రకృతి సోయగం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కొచ్చిలోని అరేబియన్ సముద్రానికి సమాంతరంగా ఉండే నిర్మలమైన బ్యాక్ వాటర్స్ విశ్రాంతిగా ఒక సియంత్రం గడిపేందుకు అనువైన ప్రదేశం. కేరళ లోని అతి పెద్ద సరస్సైన వెంబనద్ సరస్సు కొచ్చిలోని బ్యాక్ వాటర్స్. అరేబియన్ సముద్రం పక్కనించి చేసే మెరైన్ డ్రైవ్ జంటలకు గొప్ప విహార యాత్ర. జంటలకి అలాగే కుటుంబాలకు కూడా ఇక్కడ ఆనందంగా సమయం గడిపేందుకు అనువైన చోటు. సముద్రం లోంచి వీచే చల్లటి గాలి మీకు అనుభూతిని కలిగిస్తుంది. ఆకలేస్తే పక్కనే బే ప్రైడ్ మాల్ఉంది . ఫిష్ స్పా సౌలభ్యం కల ఏకైక మాల్ ఇదే, ఇక్కడ పెడిక్యూర్ చేయించుకోవచ్చు. తరువాత ఫోర్ట్ కొచ్చిలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ ప్రఖ్యాత మతన్ చెర్రీ పేలస్ మరియు శాంటాక్రుజ్ బసిలికా. ఫోర్ట్ కొచ్చిలో ఆయుర్వేద మస్సాజ్ కు పేరు.
సంవత్సరం మొత్తం పర్యాటకులని , చేపలు పట్టడంలో ఉత్సాహం గల వాళ్ళని కాంటిలెవెర్డ్ చైనీస్ ఫిషింగ్ వలలు ఆకట్టుకుంటాయి. కిట కిట లాడే కొచ్చిని సందర్శించడానికి టిక్కెట్లని రద్దీ కారణంగా ముందుగానే బుక్ చేసుకోవలసి ఉంటుంది.
మనోహరమైన కొచ్చి వాతావరణం ఎప్పుడైనా సందర్శించటానికి అనువైనది. కానీ, మే నెలలో ఎండలు, ఆగష్టు, సెప్టెంబర్లలో ఋతుపవనాలు మీకు కొంచెం ఆశాభంగం కలిగించవచ్చు. కాబట్టి, జనవరి నుండి ఏప్రిల్ వరకు మళ్లీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కేరళని సందర్శించేందుకు అనువైన సమయం.
వసతికి ఎటువంటి ఇబ్బందులూ లేనందువల్ల బడ్జెట్ కి తగిన విధంగా హోటల్స్ ని బుక్ చేసుకోవచ్చు. కొచ్చికి భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి రైలు, వాయు మరియు రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు.