కొట్టాయం కేరళలో ఒక ప్రాచీన నగరం . ముద్రణ మాద్యమం మరియు సాహిత్యంలో ఈ నగరం యొక్క పేరు ప్రఖ్యాతులను పరిగణించి కొట్టాయంను "అక్షర నగరి" అనగా "అక్షరాల నగరం" గాపిలవబడుతుంది. కొట్టాయం పాత పట్టణంను ఇప్పుడు కున్నుమ్పురం అని అంటారు. ఇది ఒక కొండ మీద ఉన్న నగరం. తూర్పు మరియు పశ్చిమ కనుమలు సరిహద్దులు గల వెంబనాడ్ సరస్సు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. ఇది ప్రకృతిపరంగా ఒక సుందరమైన ప్రదేశం.
అందమైన పర్వతాలు, కొండలు, పచ్చని లోయలు, కళ్ళు తిప్పుకోలేని సౌందర్యం కనువిందు చేస్తుంది. రబ్బరు తోటల పెంపకం, ఆకర్షణీయమైన సరస్సులను కొట్టాయంలో చూడవచ్చు. కొట్టాయం నగరం సుగంధ ద్రవ్యాలు మరియు వాణిజ్య పంటలకు, ప్రత్యేకించి రబ్బర్ కు ప్రధాన వ్యాపార కేంద్రం. భారతదేశంలో ఈ ప్రదేశం నుండి సహజ రబ్బర్లు చాల ఉత్పత్తి అవుతాయి. మలయాళ మనోరమ మరియు దీపిక వంటి కేరళ యొక్క ప్రధాన ప్రచురణ మాధ్యమానికి ఈ నగరం ముఖ్య కేంద్రం. కొట్టాయం 100% అక్షరాస్యత రేటు సాధించి భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది.భారతదేశంలో మొదటి పొగాకు రహిత జిల్లాగా పేరు పొందింది. సహజ సౌందర్యం మరియు దాని గొప్ప సాంస్కృతిక వారసత్వ కారణంగా, కొట్టాయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు విశ్రాంతి, కేరళ సంపన్నమైన సాంస్కృతిక విలువలను చూడటానికి వస్తారు.
పూంజర్ ప్యాలెస్ కేరళ యొక్క గొప్ప సంస్కృతికి ఒక తాత్కారణం. కొట్టాయం నగరంలో సందర్శకులు చూడటానికి అనేక ఆలయాలు,పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరునక్కర మహాదేవ ఆలయం, పల్లిప్పురతు కవు, తిరువేర్పు ఆలయం మరియు సరస్వతి ఆలయం,సుబ్రమణ్య స్వామి ఆలయం కొట్టాయంలో పేరుపొందిన ఆలయాలు. మీనచిల్ నది ఒడ్డున ఉన్న తజతంగడి జుమా మస్జిద్, మరియు పాత సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చిలను ప్రతి రోజు ఎంతో మంది పర్యాటకులు సందర్శిస్తారు. కొత్తతవళం వద్ద ఉన్న గుహ మరొక పర్యాటక హాట్ స్పాట్. కొట్టాయం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నత్తకం మరియు పనచికాడు అనే అందమైన సుందరమైన గ్రామాలను సందర్శించాలి. ఈ గ్రామాలలో ఉన్న వాతావరణంలో మనసుకు చాల ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా, ఎలవీజ్జ పూంచిరాను పర్యటనలో మిస్ చేయకండి.
కొట్టాయం నుండి, మున్నార్,ఎర్నాకులం , పీర్మడే , తెక్కడి, మధురై, వైకోమ్, శబరిమల, ఎట్టుమనూర్ మరియు మరిన్ని సమీప స్థలాలను కూడా సందర్శించవచ్చు. కొట్టాయం . ఇక్కడ బోటింగ్, స్విమ్మింగ్ మరియు చేపలు పట్టడం, ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ మరియు నీటి సంబంధిత క్రీడలకు ఇది చిరునామా. కొట్టాయం సంవత్సరంలో ఏ కాలంలోనైనా సందర్శించవచ్చు. అయితే, పర్యటనకు మంచిసమయం శీతాకాలం.
కేరళలోని అన్ని పట్టణాలు మరియు నగరాలతో కొట్టాయం అనుసంధానించబడింది. విమాన, రైలు,రోడ్డు మరియు జలమార్గాలు ద్వారా వెళ్లవచ్చు.