header

Kovalam Beach / కోవళం బీచ్...

Kovalam Beach / కోవళం బీచ్...
Kovalam Beach / కోవళం బీచ్... చిన్నపాటి అలలతో సీబాత్కు చక్కగా ఉంటుంది ఈ తీరం. ఇక్కడ అడుగు లోతు సముద్రపు నీటిలో పడుకుని అలల తాకిడిని ఆస్వాదిస్తున్న విదేశీయులు కనిపిస్తారు
అరేబియా సముద్ర తీరం పొత్తిళ్లలో పాపాయిని సేదదీర్చినట్లు పర్యాటకులను సేదదీరుస్తుంది. ఇక్కడి రిసార్టులు... ప్రకృతి సహజత్వాన్ని పుణికి పుచ్చుకుని ప్రతిసృష్టి చేసినట్లు ఉంటాయి. హనీమూన్ ప్యారడైజ్గా అభివర్ణించుకునే ఈ రిసార్టులు, కాటేజీల్లో స్విమ్మింగ్పూల్, మెడిసనల్ ఆయిల్బాత్, మసాజ్, యోగా సెంటర్ వంటి రిలాక్సేషన్లు ఉంటాయి. కొత్త దంపతులు హనీమూన్ ట్రిప్కి ఈ ప్రదేశానికే తొలిప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడి లీలా గ్రూప్ రిసార్టు, కరిక్కథి బీచ్ హౌస్ వంటి రిసార్టులు సముద్రాన్ని ఆనుకుని ఉన్నట్లే అనిపిస్తాయి. ఈ రిసార్టుల ఆవరణలో తిరుగుతుంటే సముద్రపు అలలు మనల్ని తాకడానికి వస్తున్నట్లు భ్రమ కల్పిస్తాయి. సముద్రంలో ఈదడానికి భయమేస్తే, సముద్రాన్ని చూస్తూ ఇక్కడి స్విమ్మింగ్పూల్లో ఈతకొట్టవచ్చు.