మలప్పురం కేరళలోని ఉత్తర ప్రాంతపు జిల్లా మరియు గొప్ప సంస్కృతికి, చారిత్రితక ప్రాధాన్యతకి, విశిష్టమైన వారసత్వ సంపదకి పేరు పొందినది. చిన్న కొండలతో , గుట్టలతో ఉన్న మలప్పురం సార్ధక నామం కలిగి ఉంది. (మలయాళంలో మలప్పురం అనగా పర్వత శిఖరం
"గల్ఫ్" వెళ్లిన కేరళ వాసుల వలన పూర్తి ఆర్థిక వృద్ధిని సాధించింది.
చలియార్, భరతపుళ, కదలుండి అనే మూడు నదులు ప్రవాహం మలప్పురం నేలని , సంస్కృతిని సుసంపన్నం చేస్తున్నాయి
ఒప్పాన అనబడే మహమ్మదీయ నాట్యకళకి ఇది పుట్టినిల్లు.
సంప్రదాయాలు , ప్రత్యేక ఆకర్షణలు.........
మలప్పురంలోని చిన్న పట్టణాలు కేరళ సంస్కృతిక, రాజకీయ, సాహిత్య సంప్రదాయాలకి సాటిలేని విధంగా దోహదపడ్డాయి. మధ్యయుగ కాలంలో "తిరునవయ" వైదిక విద్య కు కేంద్రంగా ఉంది. సాంప్రదాయ ఆయుర్వేద వైద్య వ్యవస్థ "కొట్టక్కళ్" లో మొదలయ్యింది. పొన్నాని (ప్రాచీన మహమ్మదీయ విద్యా కేంద్రం) నీలంబుర్ ( టేక్ పట్టణం) మలప్పురానికి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించాయి.
మలప్పురం లో కదలుండి పక్షి సంరక్షణ కేంద్రం, కేరళదేశ్ పురం ఆలయం, తిరునవయ లాంటి సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మలప్పురం జుమా మసీదు, మన్నూర్ శివాలయం, తిరుప్పురంతక దేవాలయం, వెట్టకోరుమకన్ దేవాలయం లాంటి గుళ్ళు,మసీదులు కలవు. కొట్టక్కున్ను పర్వత ఉద్యానవనం, బియ్యం సరస్సు, శాంతితీరం నదీతీర ఉద్యానవనం వేలాది మంది పర్యాటకులని ఇక్కడికి రప్పిస్తున్నాయి.
మధ్యస్థ వాతావరణం కలిగి పర్యటన కు అనుకూలంగా ఉంటుంది. మహమ్మదీయ జనాభా అధికంగా ఉండటంవల్ల అరబిక్, కేరళ సంప్రదాయ రుచుల మేలు కలయికగా ఒక ప్రత్యేకమైన భోజన సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. ప్రాకృతిక సౌందర్యం, సంఘటనాత్మక చరిత్ర, వంటకాలు ఇక్కడ ప్రకృతి ఆరాధకులని, చరిత్ర ప్రేమికులని, భోజన ప్రియులని సంతృప్తి పరుస్తాయి.
మలప్పురం రహదారి, రైలు, వాయు మార్గాల ద్వారా అనుసంధానించబడటం వల్ల సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్లవచ్చు.