header

Vellayani Lake /వెల్లాయని సరస్సు

Vellayani Lake /వెల్లాయని సరస్సు
వెల్లాయని సరస్సు తిరువనంతపురం జిల్లా గుండా ప్రవహించే అతి పెద్ద మంచినీటి సరస్సు. స్థానికులు దీన్ని ‘వెల్లాయని కాయల్’ అని పిలుస్తారు. తిరువనంతపురం ప్రధాన బస్సు కూడలి నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
స్థానికులు, పర్యాటకులు ఎక్కువగా సందర్శించే విహార కేంద్రాల్లో వెల్లాయని సరస్సు ఒకటి. కోవళం వెళ్తే ఒక్కసారైనా ఈ సరస్సును చూడాల్సిందే. తాజాగా ఉండే స్వచ్చమైన నీలిరంగు నీళ్ళతో ఈ సరస్సు చాలా అందంగా కనపడుతుంది. ఈ సరస్సు మీద వెన్నెల పడగానే ఈ ప్రాంతం అంతా మనోహరంగా మారిపోతుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి పర్యాటకులు రాత్రిదాకా వేచి ఉంటారు. ఈ సరస్సులో ప్రతి ఏటా ఓనం పండుగ సందర్భంగా పడవ పందాలు జరుగుతాయి. వీటిని చూడడానికి చాలామంది వస్తారు.
ఓనం పండుగ రోజులలో కోవలంలో గానీ చుట్టుపక్కల గానీ జరిగే పడవ పందాలను తప్పకుండా చూడ వలసిందే.