చిత్రాలను గీసిన పద్ధతి : గుహల గోడలకు రంగులు వేసిన విధానం నాటి ప్రజల నైపుణ్యానికి ఓ ఉదాహరణ. ఓ రకమైన మట్టి, ఇసుక, నార, గడ్డి వంటివన్నీ కలిపిన మిశ్రమాన్ని గోడలకు సున్నంలా పూసి, ఎర్రమట్టి, సన్నగా పొడిచేసిన పీచు కలిపి రెండోపూత వేశాక, దానిమీద పలుచని సున్నపుతేట వేసి ఉంటారని అప్పుడు వెడల్పుగా బోమ్మల అవుట్లైన్లను గీసి అందులో రంగురాళ్లతో చేసిన రంగులతో చిత్రాలను గీశారని పరిశీలకుల అభిప్రాయం. దేశవిదేశాలకు చెందిన కళాకారులు గుహలను సందర్శించి అద్యయనం చేస్తుంటారు.
విగ్రహాలు – భిన్నభావాలు : ఈ గుహలలో శిల్పకళా నైపుణ్యలను చూడాలంటే 1,2,4,6,7,19,24,26 గుహలను చూడాలి. వీటన్నింటికి రంగులు వేసినా కాలక్రమలో రంగులు మాసిపోయాయి. విభిన్న మానవ రూపాలు, జంతువుల బొమ్మలు నాటి శిల్పకళా రీతిని తెలియజేస్తాయి. భారీ ఆకారాలు అజంతా శిల్పకళ ప్రత్యేకత. ఒకటో గుహ అజంతా విహారాలన్నింటిలోకి ప్రత్యేకమైనది. ఇందులో వరండా, హాలు, చిన్న, చిన్న గదులు న్నాయి. గర్భగృహంలో బుద్దుడి విగ్రహం ఉపదేశ ముద్రలో ఉంటుంది.
ఓ కోణలో గంభీరంగాను మరోకోణంలో ప్రసన్నంగాను ఇంకో కోణంలో కోపంగానూ...ఇలా భిన్న కోణాల్లో చూసినపుడు విభిన్న హావభావాలు కనిపించటం ఈ శిల్పాలలోని ప్రత్యేకత.
రెండవ గుహకూడా ఎంతో అందంగా ఉంటుంది. నాలుగవ గుహ విహారాలన్నిటిలోకెల్లా పెద్దది. ఎంతో నైపుణ్యంతో మొదలు పెట్టినప్పటికీ అసంపూర్తిగా మిగిలిపోయింది. ఆరో గుహలో ముఖద్వారం చక్కగా చెక్కి వున్నది.
ఏడో గుహ ఐదో శతాబ్ధం చివరి కాలం నాటిది.
19వ గుహ చైత్య మండపం. మహాయాన కాలం చివరి భాగానికి చెందినది. ఈ గుహలో అద్భుతంగా చెక్కిన ఎన్నో బుద్ధవిగ్రహాలు భారీ సంఖ్యలో ఉండటం వలన శిల్పకళకు గొప్పనిధిగా పేర్కొంటారు. 24వ గుహ అసంపూర్తిగాఉంది. 26వ గుహలో 21 అడుగుల పొడవున మహాపరినిర్యాణం ముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహరూపం అద్భుతం. అసంపూర్తిగా వదలిన కొన్ని గుహల వలన నాటి ప్రజలు హఠాత్తుగా ప్రదేశాన్ని వదలివెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఎలా వెళ్లాలి : అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్
జల్లాలోని అజంతా గ్రామం వెలుపల ఉన్నవి. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి వెళ్లవచ్చు (104 కి.మీ)