భారతదేశంలో ప్రసిద్ధ నగరం భోపాల్, మధ్య ప్రదేశ్ రాజధాని కూడా. సరస్సుల నగరంగా పిలువబడే ఈ నగరం ఒకప్పటి పరిశుభ్రంగా వుండే ఈ నగరం దేశంలోని పచ్చటి నగరాల్లో ఒకటిగా పేరు గాంచింది.
భోపాల్ లోను, చుట్టు పక్కల చాలా ఆసక్తికరమైన పర్యాటక కేంద్రాలు వున్నాయి. భోపాల్ శివార్లలోని అందమైన విహార కేంద్రం కేవ్రా డ్యాం. మనుభాన్ కీ టేక్రీ అనే విహార కేంద్రం కొండ శిఖరం మీద వుండడం వలన కొడమీద నుంచి నగర దృశ్యం అందంగా కనబడుతుంది. ఇది జైన మతస్తులకు ముఖ్యమైన ధార్మిక ప్రదేశం.
సాయంత్రాలలోను, వారాంతాలలోను స్థానికులు తరచూ సందర్శించే మరో విహార కేంద్రం భోపాల్ శివార్లలోని షాహపురా సరస్సు. నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో శివాలయం గుఫా మందిర్ వుంది. భోపాల్ లో కొన్ని చారిత్రాత్మక కట్టడాలు కూడా వున్నాయి. వీటిలో గోహర్ మహల్, షౌకత్ మహల్, పురానా కిలా, సాదర్ మంజిల్ లాంటివి వున్నాయి.
దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది పర్యాటకులు సందర్శించే దేశంలోని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో భోపాల్ ఒకటి భోపాల్లో చూడ వలసిన పర్యాటక కేంద్రాలు చాలానే వున్నాయి.
సహజ౦గా ఏర్పడిన వన విహార్ అనబడే అభయారణ్యాలు చిరుత పులలకు ఆవాసంగా మారాయి. చరిత్ర ప్రేమికులు పురావస్తు ప్రదర్శనశాల, భారత్ భవన్ చూడాల్సిందే, అలాగే దైవ భక్తులు, బిర్లా మందిర్, మోతీ మసీదు, జామా మసీదు చూడాలి.
కళా ప్రేమికులు పురాతన కాలంలో భారతదేశంలో అత్యంత నైపుణ్యాన్ని కనబరిచే ఆలయాలు, మ్యూజియం లతోపాటు అన్ని చారిత్రక ప్రదేశాలను తప్పక సందర్శించాలి.
అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య సమయం సందర్శనకు సరైనది.
భారతేశంలోని అన్ని ప్రాంతాల నుండి భోపాల్ విమాన, రైలు, రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది