14, 15 గుహలు :
వీటిలో 14వ గుహ రావణ పరాభావ శిల్పం అత్యద్భుతం. 15వ గుహలో నట రాజ శిల్పం, లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా పరమేశ్వరుడు, ఆయనను స్తుతిస్తున్నట్లుగా బ్రహ్మ,
విష్ణువుల శిల్పాలు అమోఘం
16వ గుహ కైలాస దేవాలయం
పదహారవ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టిందట. దీని నిర్మాణానికి సుమారు ఏడు వేలమంది
కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతారు. రాష్ట్ర కూటులకు చెందిన శ్రీక్రిష్ణ -1 కు దీనిని నిర్మించిన ఘవత దక్కింది. ఈ ఆలయం అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాధలను శిల్పాలుగా చెక్కినారు. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది.
21,22 గుహలు :
21వ గుహను రామేశ్వర గుహాలయం అంటారు. 22వ గుహ నీలకంఠ గుహ అంటారు.
ఈ గుహలో సప్త మాతృకలు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలున్నాయి.21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి.
జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్ర కూటుల నిర్మాణ శైలిని పోలివుంది. మొత్తం మీద ఎల్లోరాలోని హిందూ మత గుహల్లోని పౌరా ణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను
కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.
25, 29 గుహలు :
25వ గుహలో సూర్యుడు ఏడు గుర్రాలను కట్టిన రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది అలాగే
29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం,
శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూస్తాం.
30 నుండి 34 గుహలు:
ఈ ఐదు గుహలు జైనులకు సంబంధించినవి.32వ గుహలో గోమటేశ్వరుడి శిల్పం
చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కినట్లున్నాయి. ఈ గుహల్లో జైన మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పా లున్నాయి.
ఎల్లోరా గుహలకు సమీపంలోనే ఒక జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఉంది. ఇక్కడి కొలువై ఉన్న స్వామిని ఘృష్ణేశ్వరుడు అంటారు. దేశంలో ఉన్న పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి.
ఎల్లోరా సందర్శనకు వచ్చిన యాత్రికులు ఘృష్ణేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.
ఎలా వెళ్ళాలి
రైలు ద్వారా ఔరంగాబాద్ కు చేరుకుని, అక్కడి నుండి బస్సులో కానీ, కార్లు, జీపులలో కాని ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు
|