ఈ నగరానికి సంబంధించిన అసంఖ్యాక పౌరాణిక కథలు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఉజ్జయినిని అశోకుడు మరియు విక్రమాదిత్యుడు వంటి రాజులు పరిపాలించారు. ఈ ప్రదేశంలోనే మహాకవి కాళిదాసుడు రచనలను రచించాడు. హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఇది ఒకటి. అశోకుడు, వరాహమిహిర, మహాకవి కాళిదాసు, విక్రమాదిత్యుడు మరియు బ్రహ్మగుప్తుడు వంటి ప్రముఖ వ్యక్తులతో ఈ నగరానికి అంబంధం ఉన్నది.
ఉజ్జయిని వీధులలో అమ్మే ఆహారానికి చాలా ప్రసిద్ధి మరియు టవర్ చౌక్ లో దొరికే ఈ ఆహారాన్ని పర్యాటకులు ఆనందిస్తున్నారు. స్థానిక ఆహారాలైన చాట్లు, పానీ పూరి, భేల్ పూరీ, నెయ్యితో మొక్కజొన్న అల్పాహారం వంటి ఆహారాలు లభిస్తాయి. ఉజ్జయిని నగరం గిరిజనులకు చెందిన నగలు, వస్త్రాలు మరియు వెదురు ఉత్పత్తులకు కూడా ప్రసిద్ధి చెందింది.
ఉజ్జయినికొన్నిలో ప్రసిద్ధ ఆలయాలు చింతామణ్ గణేష్ టెంపుల్, బడే గణేష్ జి కా మందిర్, హర్సిద్ధి ఆలయం, విక్రమ్ కీర్తి మందిర్, గోపాల్ మందిర్, గ్రహ మందిర, . మహాకాళేశ్వర్ ఆలయం నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలు. ఇక్కడ ఉన్న ఓంకారేశ్వర్ శివాలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.
ఉజ్జయినీలోని ఇతర పర్యాటక ప్రాంతాలు, సిద్ధవట్, బర్తృహరి గుహలు, సాందీపని ఆశ్రమం, కాలభైరవ, దుర్గాదాస్ కి చత్రి, గడ్కలిక, మంగళనాథ్ మరియు పీర్ మత్సేంద్రనాధ్ మొదలగునవి. కాళిదాస్ అకాడమితో పాటు కలియదెహ్ పాలస్ ను, అద్భుతమైన నిర్మాణ సౌందర్యం కల సాన్డల్ వాల భవనాన్ని కూడా చూడవొచ్చు. ఖగొళ శాస్త్రవేత్త గా పేరుపొందిన జైసింగ్ మహారాజు వేదశాలను కట్టించాడు. మొత్తం భారతదేశమంతటా అతను కట్టించిన అనేక పరిశోధనా కేంద్రాలను నాటికీ చూడవచ్చు. ఉజ్జయిని నగరం ఖగోళశాస్త్ర అధ్యయనాలు కోసం పేరు పొందింది.
విక్రం విశ్వవిద్యాలయం, దానియొక్క సాంస్కృతిక మరియు పాండిత్య సౌరభాలను వెదజల్లుతుంది. భారత పురాతన భాష అయిన సంస్కృతానికి కాళిదాస్ అకాడమీ ఒక అధ్యయన కేంద్రం. ఉజ్జయిని టూరిజం వారు నగరంలో సౌకర్యవంతంగా ప్రయాణించటానికి నగర పరిధిలో ఆటో రిక్షాలు, బస్సులు మరియు టాంగాస్ మొదలైన వాటిని అందుబాటులో ఉంచారు. సర్వీస్ ఆటో రిక్షాలలో చౌకగా ప్రయాణించవచ్చు. నగరం లోపల ప్రయాణించటానికి ఎక్కువ శాతం పర్యాటకులు ఈ షేర్ ఆటో రిక్షాలలోనే ఇష్టపడతారు.
ఉజ్జయినిలో వేసవిలో తీవ్రమైన ఎండలు మరియు శీతాకాలంలో వణుకు పుట్టించే చలి ఉంటుంది.
అక్టోబర్ మరియు మార్చ్ నెలల మధ్య ఉజ్జయినిని దర్శించటానికి అనుకూల సమయం
ఉజ్జయినికి దగ్గరలో ఇండోర్ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం, ఉజ్జయినికి కేవలం 55 కి.మీ. దూరంలో కలదు. ఉజ్జయిని రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని పెద్ద నగరాలకి అనుసంధానించబడింది. ప్రయాణికులు ముంబై, భోపాల్, ఢిల్లీ, ఇండోర్, ఆహ్మేదాబాద్ మరియు ఖజురహో నుండి బస్సుల ద్వారా ఉజ్జయిని చేరుకోవొచ్చు.
ఉజ్జయిని రైల్వే స్టేషన్ దగ్గరలో అందుబాటులో హోటళ్ళు ఉన్నాయి.