header

Manipur Tourism / మణిపూర్ పర్యటన

Manipur Tourism / మణిపూర్ పర్యటన
మణిపూర్ పర్యటన పర్యాటకులకు ఒక అద్భుతం. ఈ ప్రాంతం లో సరస్సులోని తేలియాడే ద్వీపాలు, విస్తారమైన పచ్చటి ప్రదేశాలు, ఒక మోస్తరు వాతావరణం మరియు మణిపూర్ ప్రజల సంస్కృతి, వేష భాషలు ఈ ఈశాన్య రాష్ట్ర ప్రత్యేకతలు.
మణిపూర్ కు ఉత్తరాన నాగాలాండ్, దక్షిణంలో మిజోరం, పడమట అస్సాం , తూర్పు మయన్నార్ సరిహద్దులు.
మణిపూర్ లో చూడవలసిన ఆకర్షణీయ ప్రదేశాలు ఇంఫాల్, - ఇంఫాల్ మణిపూర్ కు రాజధాని. ఎన్నో సుందర ప్రదేశాలు, అడవులు కలిగి వుంది. ఈ ప్రదేశంలోనే పోలో ఆట పుట్టింది అని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుక మానదు. మణిపూర్ లో పురాతన చారిత్రక అంశాలు, శిధిలాలు, స్మారకాలు, దేవాలయాలు, వంటివి ఎన్నోకలవు.
శ్రీ గోవింద్ జీ టెంపుల్, కంగ్ల పాలస్, వార్ సమాధులు, ఇమా కేఇతేల్ అనే మహిళల బజార్, ఇంఫాల్ వాలీ మరియు కొన్ని తోటలను చూడవచ్చు.
మయన్మార్ కు ప్రవేశ ద్వారంగా చెప్పబడే చందేల్ ఒక ప్రత్యేక ప్రదేశం. ఇది జిల్లా మరియు పట్టణం కూడా. మణిపూర్ పర్యటనలో ఈ ప్రాంతం తప్పక చూడాలి.
చందేల్ మరియు తమెంగ్ లాంగ్ ప్రదేశాలు వివిధ రకాల వృక్ష సంపద, జంతు సంపదలతో జీవ వైవిధ్యం కలిగిన ప్రాంతాలు. చందేల్ లోని మోర్ ప్రదేశం మణిపూర్ లోనే ప్రధాన వాణిజ్య కేంద్రం. తమెంగ్ లాంగ్ లో జరిగే ఆరంజ్ ఫెస్టివల్ ఒక ప్రధాన టూరిస్ట్ ఆకర్షణ. చిన్న చిన్న గ్రామాలు కల సేనాపతి జిల్లా ఒక ప్రత్యేకమైన టూరిస్ట్ ప్రాంతం.
మారం ఖుల్లెన్, మఖేల్, యాంగ్ ఖుల్లెన్ లు ఎంతో చరిత్రను తెలియపరుస్తాయి. పురూల్ తోటో అనే ఆటకు రాష్ట్రంలో ప్రసిద్ధి. మణిపూర్ సందర్శనలో సరస్సులు,తోటలు , పర్వత శిఖరాలు చూడవచ్చు.
ఇక్కడ కల లోక్ తక్ సరస్సు ప్రపంచం లోనే అతిపెద్ద ఫ్లోటింగ్ లేక్. ఈ సరస్సు బిష్ణుపూర్ లో కలదు. ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులు నివసిస్తారు. లోక్ తక్ సరస్సు వద్ద కల సేంద్ర ద్వీపం మరొక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్. ఈ సరస్సు సమీపం లోనే కీబుల్ లంజావో నేషనల్ పార్క్ ను చూడవచ్చు.
తామేంగ్ లాంగ్ లోని జీలాద్ సరస్సు ఫోటోగ్రాఫర్ లకు ఒక స్వర్గం. అనేక ప్రకృతి దృశ్యాలతో తౌబాల్ జిల్లా లోని విథౌ సరస్సు కూడా ఒక ఆకర్షణే.
ఐకోప్ లేక్, లౌసి లేక్,పూమ్లేన్ లేక్ లు తౌబాల్ లో ప్రధానమైనవి. ఖయాంగ్ వాటర్ ఫాల్స్ వద్ద కల కాచు ఫోంగ్ లేక్ చాలా అందమైనది. చూర చందాపూర్ లోని ఖుగా డాం, మరియు నగలోయి ఫాల్స్ కూడా టూరిస్ట్ లు అధికంగా సందర్శించే ప్రదేశాలు. ఉఖ్రుల్ లోని శిరుయి కశాంగ్ పీక్ పూర్తిగా శిరుయి లిల్లీ పూలతో కప్పబడి వేసవిలో ఆహ్లాదకరంగా వుంటుంది.