header

Meghalaya Tourism / మేఘాలయ పర్యాటకం

Meghalaya Tourism / మేఘాలయ పర్యాటకం

1972 లో ఏర్పడిన మేఘాలయ రాష్ట్రం ఖాసీ, జయంతియా, గారో తెగల ప్రజల నివాస స్థానం. ఈ రాష్ట్రంలో విస్తారంగా వున్న కొండలు - పళ్ళు, స్థానికులు అమితంగా తినే వక్క తోటల పెంపకానికి ప్రసిద్ది. మేఘాలయ రాజధాని ఐజాల్ దేశంలోని జనసాంద్రత గల పట్టణాల్లో 23 వది. ఈ రాష్ట్రానికి ఉత్తరాన అస్సాం, దక్షిణాన బంగ్లాదేశ్ లను సరిహద్దులుగా కలిగి వుంది.మేఘాలయ రాష్ట్రంలో మూడో వంతు అడవులు వున్నాయి. మేఘాలయ లోని అడవులు క్షీరదాలు, పక్షులు, మొక్కలతో జీవవైవిధ్యానికి పేరుగాంచింది.
ఇక్కడి వైవిధ్య భరితమైన వృక్ష, జంతు జాతులు మున్నెన్నడూ చూడని మంత్రముగ్ద ప్రయాణం చేయిస్తాయి.మేఘాలయలోను, చుట్టుపక్కలా పర్యాటక ప్రదేశాలు సంస్కృతులు, ప్రజలు, ప్రకృతి, భాషలతో కూడిన విభిన్నమైన ప్రయాణాన్ని మేఘాలయ పర్యాటకం అందిస్తుంది.
ఇక్కడి అందమైన భూభాగం, ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల మిజోరాంను చాలా మంది పర్యాటక ప్రదేశంగా భావిస్తారు. ముర్లేన్ జాతీయ పార్కు, డాంపా పులుల అభయారణ్యం మిజోరాంలోని కొన్ని పర్యాటక ప్రాంతాలు. పాలక్ దిల్, టాం దిల్, వంటవంగ్ జలపాతాలు లాంటి సరస్సులు, జలపాతాలు కూడా ఇక్కడి పర్యాటక ఆకర్షణల్లో కొన్ని. మేఘాలయలో చాలా నదులు వున్నాయి, వీటిలో చాలా వరకు వర్షాధారంగా, కాలానుగుణ౦గా ప్రవహిస్తాయి. దరింగ్, సంద, బాంద్రా, భోగాయి, దరెంగ్, సిమ్సంగ్, నితాయి, భూపాయి లాంటివి గారో కొండ ప్రదేశంలోని ప్రదానమైన నదులు.
ఈ మైదాన ప్రాంతంలోని మధ్య ప్రాచ్య విభాగాల్లో ఉమఖ్రీ, దిగారు, ఉమియం, క్యన్చియాంగ్, మావపా, ఉమియం లేక బారాపానీ, మైన్గోట్, మిండూ అనేవి ప్రధాన నదులు. దక్షిణ ఖాసీ కొండ ప్రాంతంలో ఈ నదులు లోతైన లోయలను, అనేక అందమైన జలపాతాలను సృష్టించాయి. మేఘాలయ ప్రజలు సాదా సీదాగా, మర్యాదగా వుంటారు.
ఖాసీలు, గారోలు, జయ౦తియాలు మేఘాలయలోని ప్రధాన తెగలు. మేఘాలయలోని ప్రధానమైన విశేషం ఏమిటంటే ఇక్కడి గిరిజన తెగల వారు మాతృస్వామ్యం అనుసరిస్తారు, దీంతో వారసత్వం, వంశావళి తల్లుల ద్వారా వస్తుంది.ఖాసీ, జయంతియా గిరిజన తెగల వారు సంప్రదాయ మాతృస్వామ్యాన్ని పాటిస్తారు. గారో వంశావళిలో అందరికన్నా చిన్న కూతురికి కుటుంబ ఆస్తి స్వాభావికంగా చెందుతుంది. అప్పుడు ఆమెను ‘నొకనా’ అంటారు, అంటే ఇంటి కోసం అని అర్ధం.మేఘాలయ లోని పండుగలు మేఘాలయ లోని గిరిజన తెగలవారు ఎంతో ఉత్సాహంతో, ప్రదర్శనలతో వివిధ పండుగలను జరుపుకుంటారు.
ఖాసిలకు నృత్యం ఎంతో ఇష్టమైనది, వైవిధ్యతో కూడినది. గ్రామస్థాయిలలో, గ్రామాల సమూహాలు లేదా పెద్ద ఉత్సవాలు జరిగేటపుడు నృత్యాలు చేస్తారు. స్థానిక లేదా ప్రాంతీయ అభిరుచులు, రంగులు ఖాసి జాతులకు సంప్రదాయంగా వచ్చే ఈ మౌలిక నృత్యరీతికి వైవిధ్యం అందిస్తాయి. కా షాద్ సుక్ మిన్సియెం, కా పోమ్-బ్లాంగ్ నోంగ్ క్రేం, కా షాద్ షింగ్ వియాంగ్-తన్గియాప్, కా షాద్ కింజో ఖాస్కైన్, కా బామ్ ఖానా శ్నోంగ్, ఉమ్సాన్ నోంగ్ ఖరాయి, షా బే సియెర్ ఖాసి జాతి వారి వివిధ పండుగలలో కొన్ని.
జయంతియా కొండల్లో జరిగే పండుగ. బే దియేన్ ఖలాం, లాహో నృత్యం, సోయింగ్ వేడుక లాంటివి జయ౦తీయాల పండుగలలో కొన్ని.దెన్ బిల్సియా, వంగలా, రోంగ్చు గల, మి అమువా, మంగోనా, గ్రెంగ్డిక్ బా, జమంగ్ షియా, జా మెగాపా, శా సాత్ రా చాక, అజియోర్ ఆహోయియా, డోరే రాతా నృత్యం, చంబిల్ మేసారా, డో కృసువా, సారం చా ఆ, అ సె మానియా లేకా తాతా లాంటివి గారోలో ప్రధాన పండుగలు
మేఘాలయలో వాతావరణం ఒక మోస్తరుగా, తేమగా వుంటుంది. ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత ఎప్పుడో తప్ప 28 డిగ్రీలకు మించదు. ఖాసీ కొండల్లో వుండే చిర్రపుంజీలో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మేఘాలయ సందర్శనకు మార్చ్ నుంచి జూలై నెలలు ఉత్తమం.

Meghalaya Tourism / మేఘాలయ పర్యాటకం

English version will be published soon............................................. ..................... ........................ ........................... ............................ ................. ............... ........................ .................................... .......................... .............. .................................... ............................................. ..................... ........................ ........................... ............................ ................. ............... ........................ .................................... .......................... .............. .................................... .......................... .............. .................................... .......................... .............. .............................................................. .............. .................................... .......................... .............. .................................... .......................... .............. .................................... .......................... .............. ....................................
మేఘాలయాలో చూడవలసినవి.......
Shillong / షిల్లాంగ్…………