ఈశాన్య భారతదేశంలో సముద్రమట్టానికి 1495 కిలో మీటర్ల ఎత్తులో ఉన్నది నాగాలాండ్. నాగాలాండ్ లోని అందమైన పర్వతాల మధ్య దర్శనిమిచ్చే నాగాలాండ్ రాజధాని కోహిమా ప్రకృతి అందించిన ఓ గొప్ప అద్భుతమే కాకుండా మంచి పర్యాటక ప్రదేశం కూడా.
డిజుకో లోయ ట్రెక్కింగ్ చేసేవారికి అనుకూలం. ఈ లోయల్లో తెలుపు, పసుపు, పచ్చ రంగులలో విరబూసే లిల్లీపూలు సందర్శకుల మనసును ఆకట్టుకుంటాయి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన రోడో డెండ్రాన్ పూలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. డిసెంబరు నెలలో అధికంగా కురిసే మంచుతో ఈ ప్రదేశం మంచుమయమవుతుంది. డిజుకో లో సముద్రమట్టానికి 2438 మీటర్ల ఎత్తులో ఉంది.
1970వ సంవత్సరంలో నాగాలాండ్ ప్రభుత్వం బయావు హిల్ మీద ఏర్పాటు చేసింది.
పండుగ సమాయాలలో గిరిజనులు వాడే అతిపెద్ద డప్పును ఇక్కడ భద్రపరిచారు. నాగాలాండ్ చరిత్రకు సాక్ష్యాలు నిలిచే స్థూపాలు, విగ్రహాలు, అలంకరణకు వాడిన నగలు, తోరణాలను ఇక్కడ చూడవచ్చు. పక్షుల కేంద్రాన్ని కూడా ఇక్కడ దర్శించవచ్చు. ఈ పక్షులన్నీ కేవలం ఈశాన్య రాష్ట్రాలలో కనిపించే అరుదైన జాతులకు చెందినవి. వివిధ తెగల సంప్రదాయ దుస్తులు, కళారూపాలు, సంగీతసాధనాలు, వెండి గంటలు, రత్నాభరణాలు ఇంకా ఎన్నింటినో చూడవచ్చు.
రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ దేశం కోహిమాను ఆక్రమించుకుంది. ఈ సమయంలో జపాన్ సేనలతో వీరోచితం పోరాడి ప్రాణాలు ఒడ్డిన వారి జ్ఙాపకార్థం ఇక్కడ ఓ ప్రాంతాన్ని ఏర్పాటు చేసారు. రాతిఫలకంపై ఈ విధంగా చెక్కివుంది.
మీరు ఇంటికి వెళ్లాక....మీ రేపటికోసం మేం ఈ రోజు మా ప్రాణాలు త్యాగం చేసాం అని అందరికీ తెలపండి. ఈవి చదివితే వారి త్యాగఫలం గుర్తుకు వస్తుంది. యుద్ధంలో చనిపోయిన 1421 మంది అమరుల వివరాలతో కంచుతో చేసిన ఈ ఫలకాలు ప్రతి సమాధివద్ద ఏర్పాటు చేశారు. ఈ యుద్ధంలో భారతీయులతో పాటు వివిధ దేశాలకు చెందిన వీరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరికి శ్రద్ధాంజలి ఘటించేందుకు కెనడా, ఇంగ్లండ్ దేశాలనుండి కూడా వారి మిత్రులు, బంధువులు రావటం గమనార్హం. కోహిమాకు వెళ్లిన సందర్శకులు తప్పకుండా ఈ ప్రాంతాన్ని దర్శించి అమరవీరులకు తమ నివాళులు అర్పిస్తారు.
డిసెంబర్ మొదటివారంలో జరిగే ఈ పండుగ అత్యంత విశిష్టతను కలిగి ఉంది. నాగా ప్రజల జీవనాన్ని ప్రతిబింబించే పండుగ ఇది. నృత్యాలు, చేతికళల ప్రదర్శనలతో పర్యాటకులకు స్వాగతం పలుకుతారు. ఈ పండుగను ఎవరికి వారే కాకుండా సమిష్టిగా జరుపుకుంటారు. నాగాలాండ్ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్వంతో ప్రభుత్వం ఈ పండుగను 2006సంవత్సరం నుండి ప్రారంభించింది. హార్న్ బిల్ అనేది ఒక పక్షి పేరు. ఈ పక్షి వీరి సంస్కృతిలో ప్రాధాన్యం కలిగి ఉంది. అందుకే ఈ పండుగకు ఈ పక్షిపేరు పెట్టారు. నాగా డ్యాన్సులు, డప్పు, డోలు వాయిద్యాలతో పండుగ కోలాహలంగా ఉంటుంది.
చుట్టపక్కల ఉన్న చర్చీల కంటే ఈ చర్చి ఎంతో పెద్దది. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రార్థనలు చేసుకోవటానికి ఈ చర్చికి వస్తారు. ఇక్కడ చెక్కతో చేసిన శిలువ దేశంలోనే అతిపెద్ద శిలువగా పేరుపొందింది.
రోడ్డుమార్గం : ఇంఫాల్ కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. అక్కడనుండి బస్సుల ద్వారా కోహిమాకు వెళ్లవచ్చు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర ప్రాంతాలనుండి కూడా బస్సుల ద్వారా వెళ్లవచ్చు.