భువనేశ్వర్ ఒడిషా యొక్క రాజధాని నగరం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో ఉన్న ఒక పట్టణం. మహానది నైరుతి ఒడ్డున ఉన్నది. ఈ నగరం కళింగ కాలం నాటి అద్భుతమైన నిర్మాణాలు కలిగి ఉంది. ఈ పురాతన నగరం 3000 సంవత్సరాల గొప్ప వారసత్వం చరిత్ర కలిగి ఉన్నది. భువనేశ్వర్ యొక్క భూభాగంలో 2000 కంటే ఎక్కువ దేవాలయాలు కలిగి ఉంటాయని భావిస్తున్నారు.
ఒడిషాలో ఇది అతి పెద్ద నగరం భువనేశ్వర్. భువనేశ్వర్ లో దేవాలయాలు,సరస్సులు,గుహలు, మ్యూజియంలు,ఉద్యానవనాలు,ఆనకట్టలు మొదలైనవి ఉన్నాయి. అంతేకాక లింగరాజ్ ఆలయం, ముక్తేస్వర్ ఆలయం,రాజరాణి ఆలయం, ISCON ఆలయం,రామ్ మందిర్, షిర్డీ సాయి బాబా మందిర్, హీరాపూర్ వద్ద యోగిని దేవాలయం మరియు ఇతర దేవాలయాలు భారీ సంఖ్యలో ఉన్నాయి.
భువనేశ్వర్ యొక్క అత్యద్భుతమైన అందానికి బిందుసాగర్ లేక్, ఉదయగిరి, ఖండగిరి, దులి గిరి,చందక వన్యప్రాణుల అభయారణ్యం, అత్రి వేడి నీటి బుగ్గ యొక్క గుహలు వంటి సహజ అద్భుతాలు యొక్క ఉనికిని చాటి చెబుతాయి
ఒరిస్సా రాష్ట్రంలో మ్యూజియం, గిరిజన కళ మరియు కళాఖండాలు మరియు ఓల్డ్ టౌన్ మ్యూజియం సందర్శించడానికి ఆకర్షణలు ఉన్నాయి.
భువనేశ్వర్ నగరంలో అనేక పార్కులు ఉండుట వల్ల ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకరమైన ప్రదేశం. వాటిలో బిజూ పట్నాయక్ పార్క్, బుద్ధ జయంతి పార్క్, IG పార్క్,ఫారెస్ట్ పార్క్,మహాత్మా గాంధీ పార్క్, ఎకమ్ర కానన్,IMFA పార్క్, ఖారవేల పార్క్,SP ముఖర్జీ పార్క్,నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పార్క్ మొదలైనవి.
క్రీడలు లేదా సైన్స్ అంటే ఇష్టపడేవారికీ రీజనల్ సైన్స్ సెంటర్, పథని సామంత ప్లానెటోరియం మరియు కళింగ స్టేడియం అనేవి చూడవచ్చు. పిల్లలు నందన్ కానన్ జూ సందర్శించడం కొరకు ఇష్టపడతారు.
పిప్లి గ్రామంలో అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. పర్యాటకులు భువనేశ్వర్ లో అనేక దేవాలయాలే కాక అద్దకం బట్టలు, ఇత్తడి మెటల్ వస్తువులు,చెక్క వస్తువులు మొదలైనవి ఖరీదు చేయవచ్చు.
భువనేశ్వర్ లో శివాలయాలు ఎక్కువ. శివాలయాలలో కొన్ని ప్రముఖమైనవి అష్టశంభు దేవాలయాలు, భ్రింగీస్వర శివాలయం, బ్యామోకేశ్వర ఆలయం, భాస్కరేశ్వర్ ఆలయం, గోకర్నేశ్వర శివాలయం, గోసగారేశ్వర్ సరిహద్దు శివ ఆలయం, జలేశ్వర్ శివ ఆలయం,కపిలేశ్వర శివాలయం,సర్వత్రేశ్వర శివాలయం, శివతిర్త మాతా,స్వప్నేశ్వర శివాలయం, ఉత్తరేశ్వర శివాలయం మరియు యమేశ్వర్ ఆలయాలు.
ఇంకా అనేక పురాతన శివాలయాలు, ఇతర దేవతల ఆలయాలు ఉన్నాయి.
శీతాకాలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. భువనేశ్వర్ చూడటానికి అనుకూల సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు.
విమాన, రోడ్డు మరియు రైల్వేల ద్వారా సులభంగా భువనేశ్వర్ నకు చేరుకోవచ్చు