ఇది వరకు ఒరిస్సా అని పిలిచిన భారతదేశ సంపద, గర్వకారణం. ఒడిషాని ప్రేమగా ‘భారతదేశ ఆత్మ’ అని అంటారు.
‘గోల్డెన్ ట్రయాంగిల్’ గా పిలువబడే మూడు ప్రసిద్ధ ఆలయాలు ఒడిషాలో ఉన్నాయి, భువనేశ్వర్ లోని లింగరాజ ఆలయం, పూరి లోని జగన్నాధ ఆలయం, కోణార్క్ లోని సూర్యదేవాలయం.
భువనేశ్వర్ నగరంలో వందకంటే ఎక్కువ ఆలయాలు ఉన్నాయి. వాటిలో అనేకం గొప్ప చారిత్రిక సంబంధం కలిగిఉన్నాయి.
పూరి భారతదేశంలోని పవిత్ర చార్ధాంలలో ఒకటి. మరో మూడు ద్వారకా, బద్రినాద్, రామేశ్వరం.
కోణార్క్ గ్రామం ఒడిషాలోని నిర్మాణ పరిపూర్ణ శైలిని ప్రతిబింబించే సూర్యదేవాలయంతో ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం శిధిలమై పోయింది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరుగాంచింది.
Konark Tem[le / కోణార్క్ సూర్య దేవాలయం
Lingaraj Temple / లింగరాజ్ దేవాలయం
Puri Jagannathalayam / పూరి జగన్నాధ దేవాలయం
Bhuvaneswar / భువనేశ్వర్