జైన్ స్మారకచిహ్నాలు, బౌద్ధ కేంద్రాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు ఒడిష సంపద ఎంత వైవిధ్యంగా ఉందొ తెలియ చెబుతాయి.
ఒడిష ప్రజలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమ్మేళనం. జనాభాలో ఎక్కువమంది వ్యవసాయ కార్మికులు. ఎక్కువమంది నగరాలకంటే గ్రామాలలోనే ఉంటున్నారు. రాష్ట్రము మొత్తం జనాభాలో దాదాపు ఒక వంతు గిరిజన వర్గాల వారు ఉన్నారు. ఈ కమ్యూనిటీలు ఇప్పటికీ వారి సంస్కృతిని కాపాడుకుంటూ, అనుసరిస్తున్నారు.
ఒడిష సంస్కృతి, వంటకాలు సంప్రదాయాన్ని ఆదరించే రాష్ట్రం కావడంతో, రాష్ట్ర ప్రజలు వారి మతాన్ని, ఆచారాలను ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఒడిస్సీ, ఒడిష శాస్త్రీయ నృత్య విధానం, ఇప్పటికీ ఇది రాష్ట్రంలో సజీవంగాఉంది. నృత్యాన్ని రాష్ట్రంలో వివాహాలు, ఇతర ఉత్సవాల సమయంలో ప్రదర్శిస్తారు.
ఒడిష ప్రజలు సహజమైన ఆహారాన్ని ఇష్టపడతారు. అన్నాన్ని ఇష్టపడేవారు, వంటలలో ఎక్కువగా తేలికపాటి రుచి కలిగినవాటిని సిద్ధం చేస్తారు. వాటిటో కొన్ని దాల్మ, బేసర, దహి బైగాన, ఆలూ పరాతా వంటివి.
వేడుకలు, పండుగలు ఒడిష జనాభాలో ఎక్కువమంది రైతులు కాబట్టి, సాగు సీజన్ కి సంబంధించిన పండుగలు ఎక్కువ ఉంటాయి. ఒడిష ద్రావిడ, ఆర్య, ఇతర పురాతన సంస్కృతుల మిశ్రమం కాబట్టి, ఇక్కడ జరిగే పండుగలు కూడా వివిధ సంప్రదాయాలను కలిగి ఉంటాయి.
మకరమేళా, మాఘసప్తమి, రథయాత్ర, దుర్గాపూజ వంటి పండుగలను రాష్ట్ర౦ మొత్తం గొప్పగా జరుపుకుంటారు.
ఈ పండుగలే కాకుండా, ఒడిష లో కోణార్క్ ఫెస్టివల్, రాజారాణి మ్యూజిక్ ఫెస్టివల్, ముక్తేశ్వర్ నృత్య పండుగ వంటి సాంస్కృతిక కళా వేడుకలు జరుపుకుంటారు.
ఒడిషాకి రైలు, రోడ్డు, విమానాల ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా చేరుకోవడం తేలిక.