బంగాళాఖాతంలోని కోరమాండల్ తీరప్రాంతంలో ఉన్న పాండిచేరి నగరం చెన్నై నుండి 162 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఫ్రెంచి పాలన లో ఉండటమే కాక 1674 నుండి 1954 వరకు ఫ్రెంచి వలసల ప్రధాన రాజ్యమైంది.
ఫ్రెంచి వారు పాండిచేరిని మూడు శతాబ్దాల కాలం వరకు పాలించారు, దాని వలన ఉత్తమ సంస్కృతి, నిర్మాణశైలులు ప్రతిబింబించే ఒక ప్రత్యేకమైన వారసత్వం ఈ నగరానికి మిగిలింది.పరిమళాలు, సుగంధద్రవ్యాలతో వంటి దర్శనీయ స్థలాల కలగూరగంప పాండిచ్చేరి.
ఒక విభిన్న పర్యాటక అనుభవాన్ని కోరుకొనే వారికి పాండిచేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఈ నగరంలో నింపే ప్రోమనేడ్ బీచ్, పారడైస్ బీచ్, సేరెనిటి బీచ్, ఆరొవిల్లె బీచ్ వంటి నాలుగు చక్కటి తీరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని మరొక ముఖ్య ఆకర్షణ శ్రీ అరబిందో ఆశ్రమం, భారతదేశంలోని ఉత్తమ ఆశ్రమమే కాక , ధ్యాన కేంద్రాలలో ఒకటి.
సూర్యోదయ నగరంగా కూడా పేరొందిన ఆరోవిల్లె నగరం, తన ప్రత్యేక సంస్కృతి, వారసత్వ కట్టడాలు, నిర్మాణ శైలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. గాంధీ విగ్రహం, మాతృమందిర్, ఫ్రెంచి యుద్ధ స్మారకం, జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ విగ్రహం, గౌబెర్ట్ అవెన్యూలో ఉన్న జోన్ ఆఫ్ ఆర్క్ పాలరాయి విగ్రహం వంటి అనేక స్మారక చిహ్నాలు, విగ్రహాలకు పాండిచేరి నివాస స్థలం. పాండిచేరి మ్యూజియం, జవహర్ టాయ్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ఒస్టేరి మాగాణులు, భారతిదాసన్ మ్యూజియం, నేషనల్ పార్కు, అరికమేడు, డుప్లెక్స్ విగ్రహం, రాయ్ నివాస్
ఈ నగరం చర్చీలు, హిందూ ఆలయాల వంటి ధార్మిక ప్రదేశాలతో కూడిన ఆసక్తికరమైన ఒక సమ్మేళనం. ది ఎగ్లిసే డి నోత్రే డామే డెస్ అంజేస్ ( ది చర్చ్ ఆఫ్ అవర్ లేడి ఆఫ్ అంజేల్స్ అని కూడా అంటారు), ది చర్చ్ ఆఫ్ సాక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసస్, ది కథేడ్రల్ ఆఫ్ అవర్ లేడి ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, శ్రీ మనకుల వినయగర్ ఆలయం, వరదరాజ పెరుమాళ్ ఆలయం, కన్నిగా పరమేశ్వరి ఆలయం పాండిచేరిలో తరచూ సందర్శించే ధార్మిక ప్రాంతాలు
ప్రత్యేక నిర్మాణ శైలులు ఉన్న ఈ నగరం కాలి నడకన తిరిగినప్పుడు మనసుకు ఒక అద్భుతమైన అనుభవాన్ని కల్గిస్తుంది. ఈ నగరంలోని అనేక వీధులకు ఫ్రెంచి పేర్లు ఉన్నాయి, వలస నిర్మాణశైలిలో నిర్మించబడిన వైభవమైన ఇళ్ళు అలాగే భవంతులు కూడా సందర్శకులకు కనువిందైన దృశ్యాలను అందిస్తుంటాయి.
ఈ నగరం ఫ్రెంచి క్వార్టర్, ది ఇండియన్ అనే రెండు భాగాలుగా విడదీయబడింది. వలస నిర్మాణ శైలితో నిర్మించిన కట్టడాలు మొదటి భాగ లక్షణం కాగా, రెండవది పురాతన తమిళ శైలి, నమూనాలతో కనబడుతుంది. ఈ రెండు ప్రత్యేక శైలుల సమ్మేళనం పాండిచేరి నగరానికి ఒక చక్కదనాన్ని, విలక్షణతను ఇస్తున్నాయి.
ఫ్రెంచి, తమిళ సంస్కృతుల ప్రభావాలతో నిండిన పాండిచేరి, భోజన ప్రియుల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తుంది. పర్యాటకులు ఫ్రెంచి బగేట్స్, బ్రియోచేస్, పేస్ట్రీలు వంటి అసలైన ఫ్రెంచి వంటకాలతో బాటుగా సంప్రదాయ తమిళ, కేరళ వంటకాలను కూడా రుచి చూడవచ్చు. లి క్లబ్, బ్లూ డ్రాగన్, స్టాట్ సంగ, రెండేజ్వాస్, సీ గల్స్, లే కెఫే, లా కోరోమండలే, లా టేరస్సె లలో మంచి ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.
ఈ నగరంలోని వీధులు, అంగళ్లలలో హస్తకళలు, వస్త్రాలు, రాళ్ళు, చెక్క శిల్పాలు, చాపలు, కుండలు, పరిమళాలు, అగరులు, అద్దపు పనులు, దీపాలు, కొవ్వత్తులతో కళకళలాడుతాయి. డిసెంబర్ లో జరిగే అంతర్జాతీయ యోగా ఉత్సవం, ఆగష్టు లో జరిగే ఫ్రెంచి ఆహార ఉత్సవం, జనవరిలో జరిగే షాపింగ్ ఉత్సవం ఇక్కడ తరుచుగా జరిగే ఉత్సవాలలో కొన్ని.
పాండిచేరి నగరానికి చక్కటి రైలు, రోడ్డు సదుపాయం ఉంది.చెన్నై నుండి వెళ్లవచ్చు. ఈ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్గి ఉండి ఏడాది పొడవునా విశ్వ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.