header

Punjab Tourism / పంజాబ్ పర్యాటకం
పెద్ద రాష్ట్రమైన పంజాబ్ 1966 లో హిమాచల్ ప్రదేశ్, హర్యానాగా విభజించబడింది, భారతదేశానికి వాయువ్య దిశలో ఉంది. పశ్చిమదిక్కులో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, హర్యానా, రాజస్తాన్, పాకిస్తాన్ లు సరిహద్దులుగా ఉన్నాయి. దేశంలోని అతిచిన్న రాష్ట్రాలలో ఒకటి. సిక్కుమతస్తులకు చిరునామా పంజాబ్ . పంజాబ్ నగరానికి చండీగర్ రాజధాని
పంజాబ్ ఐదు నదుల కూడలి గల భూమి. ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృత్తి. రాష్ట్రంలోని ఉత్తర భాగం హిమాలయాల దిగువ భాగంలో ఉంటే, దక్షిణ భాగం థార్ ఎదారితో కలిసిఉంది. పంజాబ్ వేసవిలో వేడి వాతావరణం, శీతాకాలంలో చల్లగా వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుంది. వర్షాకాల సమయంలో భారీ వర్షపాతం ఉంటుంది.
దేశంలోని ఈ ప్రాంతంలో సహజ అడవులు లేవు. నారింజ, దానిమ్మ, ఆపిల్, పీచ్, అత్తి, మల్బరీ, నేరేడు పండు, బాదం, ప్లం వంటి పండ్లను ఇక్కడ పండిస్తారు. ఇక్కడి భూమి పొదలు, గడ్డి, మొక్కలతో కప్పబడి ఉంటాయి. పంజాబ్ లో భారతదేశంలోని అత్యుత్తమ మౌలిక వసతులు ఉన్నాయి. గోధుమ, వారి, చెరుకు, కూరగాయలు లాంటి పంటలు పండించే పంజాబ్ ని “భారతదేశ ధాన్యాగారం” అంటారు.
ఇక్కడి జలాలలో మొసళ్ళు సాధారణంగా కనపడతాయి. పట్టుపురుగులు, తేనెటీగలు ఎక్కువగా పెంచుతారు. అలాగే గుర్రాలు, ఒంటెలు, గేదెలను కూడా పెంచుతారు. పంజాబ్ పర్యటనలో అనేక ఇతర జాతుల క్షీరదాలను కూడా చూడవచ్చు. పంజాబ్ సంస్కృతి, నాగరికత పర్యాటకులను ఆసక్తి కలిగించేటట్లు ఉంటుంది. అద్భుతమైన భవనాలు, ఆలయాలు, మందిరాలు, ఈ ప్రాంతం పర్యటనకు అనుకూలమైనది. ఫరీద్ కోట్, జలంధర్, కపుర్తాల, లుధియానా, పఠాన్కోట్, పటియాల, మొహలిచూడదగ్గ ప్రాంతాలు. ప్రతి ప్రాంతం ఏదోఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది. సంస్కృతి, సంప్రదాయాలు పంజాబ్ పర్యటనలో ప్రధాన విషయాలు. గోవింద్గర్ ఫోర్ట్, కిల ముబారక్, షీష్ మహల్, ఒకప్పటి పాలకుల సంప్రదాయ స్థాయిని ప్రతిబింబించే జగత్జిట్ భవనం వంటి వివిధ కోటలు ఉన్నాయి. అత్తరి సరిహద్దు, ఆమ్ ఖాస్ బాగ్, బారాదరి తోటలు, తఖట్-ఇ-అక్బరి, జలియన్ వాలాబాగ్, రుజ షరీఫ్ వంటివి కొన్ని పేరుగాంచిన స్మారకలు.
ప్రభుత్వ మ్యూజియం, ఆర్ట్ గాలరీ, షహీద్-ఇ-అజాం, సర్దార్ భగత్ సింగ్ మ్యూజియం, పుష్ప గుజ్రాల్ వైజ్ఞానిక నగరం, మహారాజ రంజిత్ సింగ్ మ్యూజియం సందర్శించదగ్గ మ్యూజియంలు. డేరా సన్త్గర్హ, గురుద్వారా గార్న సాహిబ్, గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్, గురుద్వారా శాహిద్గంజ్ తల్వండి జత్తన్ మొదలైనవి రాష్ట్రంలోని ప్రతి జిల్లలో ఎక్కువగా కనిపించే అనేక ఇతర గురుద్వారాలు.
శ్రీ రామ్ తీర్థ ఆలయం, దుర్గియన ఆలయం, శివాలయం, కత్గర్, కామాహి దేవి ఆలయం, దేవి చెరువు మందిరం వంటివి కొన్ని హిందువుల ధార్మిక ప్రదేశాలు. మూరిష్ మసీదు పంజాబ్ లో నివశించే ముస్లింల పవిత్ర స్థలం. సంఘోల్, పురావస్తు మ్యూజియం, రూప్ నగర్ వంటివి కొన్ని పంజాబ్ పర్యటనలో విభిన్న దృక్కోణం కలిగిన పురావస్తు ప్రదేశాలు. చ్చాత్బిర్ జూ, తఖ్ని-రేహ్మపూర్ వన్యప్రాణుల అభయారణ్యం, కంజలి వెట్ లాండ్, హరికే తడిభూమి, టైగర్ సఫారీ, జింకల పార్కు మొదలైనవి రాష్ట్ర అందాన్ని పెంపొందించే పంజాబ్ లోని వన్యప్రాణుల అభయారణ్యాలు.
పంజాబ్ ప్రజలు సిక్కు మతాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. అమ్రిత్ సర్ లోని స్వర్ణ దేవాలయం సిక్కులకు పవిత్ర మందిరం.ఈ దేవాలయ చరిత్ర ప్రపంచ ప్రసిద్ది గాంచినది. పంజాబ్ లోని ప్రతి గ్రామంలో గురుద్వారాలు కనిపిస్తాయి.
ఇక్కడ అనుసరించే రెండవ మతం హిందూమతం. పంజాబ్ లో వ్యావహారిక భాష పంజాబీ. ఇక్కడ నివసించే ప్రజలు ఉల్లాసంగా, వివిధ సాంస్కృతిక కార్యకలాపాలతో జీవితాన్ని గడుపుతారు. నృత్యంతో కూడిన సంగీతం, వివిధ వంటకాలు ఇక్కడి సాధారణం.
లోహరి, వసంత, వైశాఖి, తీజ్ అనేవి పంజాబ్ లోని కొన్ని పండుగలు. భాంగ్రా, పంజాబ్ లోని ప్రసిద్ధ నృత్య రూపకం. ఇది ప్రారంభంలో పంటల కోతల మయంలో జరిగే నూర్పిళ్ళ నృత్య రూపకం, కానీ ఇది క్రమంగా ప్రపంచ ప్రసిద్ది పొందింది. చరిత్ర గురించి చెప్పే జానపద రూపాలు కూడా పంజాబ్ లో ప్రసిద్ది పొందాయి.