india tour header

Kumbhalgarh / కుంభాల్ ఘర్

Kumbhalgarh / కుంభాల్ ఘర్
రాజస్ధాన్ లోని రాజసమండ్ జిల్లాలోని కుంభాల్ ఘర్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం రాష్ట్రంలో దక్షిణ భాగంలో కలదు. దీనిని కుంభాల్ మేర్ అని కూడా అంటారు. రాజస్ధాన్ రాష్ట్రంలో కుంభాల్ ఘర్ కోట రెండవ ప్రసిద్ధిచెందిన కోట. దీనిని 15వ శతాబ్దంలో రాణాకుంభ నిర్మించాడు. కోట పైభాగం నుండి పర్యాటకులు చుట్టుపక్కట దృశ్యాలను చూడవచ్చు. ఎత్తైన కోటగోడ శత్రువుల నుండి రక్షించుకునేందుకు నిర్మించబడింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండవ పొడవైన కోట గోడగా చెపుతారు. మేఘాల ప్యాలెస్ రాజస్ధాన్ లోని ఇతర ప్రదేశాలవలెనే, కుంభాల్ ఘర్ లో కూడా అందమైన ప్యాలెస్ లు ఉన్నాయి. వాటిలో బాదల్ మహల్ ఒకటి. దీనిని మేఘాల ప్యాలెస్ అని అంటారు. దీనిలోనే మర్దనా మహల్ మరియు జనానా మహల్ అనేవి కలవు. ప్యాలెస్ లోని సుందరమైన గదులు రంగు రంగుల కుడ్య చిత్రాలచే అలంకరించబడ్డాయి. ఈ గదులు వారి ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్ విధానాన్ని తెలుపుతాయి.
కుంభాల్ ఘర్ లో సైట్ సీయింగ్ ....
అందమైన ప్రదేశాలే కాక కుంభాల్ ఘర్ లో దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో వేది దేవాలయం, నీలకంఠ మహదేవ దేవాలయం, ముచ్చల్ మహావీర్ దేవాలయం, పరశురాం దేవాలయం, మమ్మదేవ్ దేవాలయం మరియు రాణక్ పూర్ జరైన్ దేవాలయం ప్రసిద్ధి గాంచినవి.
కుంభాల్ ఘర్ వన్యప్రాణుల అభయారణ్యంలో నాలుగు కొమ్ముల జింక, చిరుతపులులు, అడవి, తోడేళ్ళు, ఎలుగు బంట్లు, నక్కలు, సాంబార్ లు, చింకారాలు, చిరుతపులులు, హైనాలు, అడవి పిల్లులు, మరియు కుందేళ్ళు వంటి వాటిని చూడవచ్చు. హల్ది ఘాటి మరియు ఘనేరావ్ కుంభాల్ ఘర్ ఇతర పర్యాటక ఆకర్షణలు.
వాతావరణం
కుంభాల్ ఘర్ ఏడాది పొడవునా అనుకూల వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. అయితే, ఈ ప్రదేశం సందర్శించడానికి అనువైన సమయం అక్టోబరు నుంచి మార్చి నెలలు. ఈ సమయంలో పర్యాటకులు కుంభాల్ ఘర్ పర్యటన అధికంగా ఆనందించగలరు.
కుంభాల్ ఘర్ కు ప్రయాణ సౌకర్యాలు ....
విమాన, రైలు, మరియు రోడ్డు మార్గాలలో కుంభాల్ ఘర్ కు చేరవచ్చు. ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయం మరుయు డబోక్ విమానాశ్రయం సమీప విమానాశ్రయాలు. విదేశీ పర్యాటకులు న్యూఢిల్లీ మహాత్మా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కూడా చేరవచ్చు. ఫాల్నా జంక్షన్ రైల్వే స్టేషన్ కుంబాల్ ఘర్ కు సమీప రైలు స్టేషన్ . ముంబై, అజ్మీర్, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, జోధ్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు తరచుగా రైళ్లు కలవు. పర్యాటకులు కుంభాల్ ఘర్ చేరుకోవడానికి విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ ల నుండి క్యాబ్ లు లభిస్తాయి. ప్రైవేటు మరియు ప్రభుత్వ బస్సులు ఉదయపూర్ అజ్మీర్, జోధ్పూర్ మరియు పుష్కర్ పట్టణాలనుండి అందుబాటులో ఉన్నాయి.