india tour header

Kota City / కోట నగరం

Kota City / కోట నగరం
చంబల్ నది ఒడ్డున వున్న కోట నగరం రాజస్థాన్ రాష్ట్రంలోని అత్యంత ప్రాముఖ్య౦ కల్గిన నగరాలలో ఒకటి. అనేక ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రాలు, పరిశ్రమలకు పుట్టిల్లు అయినందున దీనిని రాష్ట్ర పరిశ్రమల రాజధాని అని అంటారు. ఆసియాలోని అతి పెద్ద ఎరువుల కర్మాగారం ఈ కోటలోనే ఉంది. గుజరాత్, ఢిల్లీ ల మధ్యన జరిగే వాణిజ్యానికి ఈ ప్రాంతం ఒక ప్రధాన కేంద్రం. రాజస్థాన్ లోని ఈ ప్రాంతంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలూ ఉన్నందున దీనిని విద్యా కేంద్రం అని కూడా అంటారు.
కోటలో సందర్శనీయ స్థలాలు
రాజస్థాన్ లో భాగమైనందున అనేక హవేలీలు, రాజప్రాసాదాలు, కోటలు, ఇంకా ఇతర పర్యాటక ఆకర్షణలు అనేకం ఉన్నాయి. అంతే కాక అనేక ప్రసిద్ది చెందిన ధార్మిక కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. గురుద్వారా అజంఘర్ సాహెబ్, గోదావరి ధాం దేవాలయం, గరడియ మహాదేవ దేవాలయం, మధురాదీష్ మందిరం కోట లోని కొన్ని ప్రసిద్ధ ధార్మిక కేంద్రాలు.
కోటలో ఆజంఘర్ సాహెబ్ గురుద్వారా అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి. ఈ గురుద్వారాలో గల కత్తి, ఒక జత పాదుకలు, శిక్కుల 10వ గురువైన గురు నానక్ కు చెందినవిగా విశ్వసిస్తారు. అంతేకాక ఈ ప్రాంతం పేరొందిన కవి అయోధ్య సింగ్ హరి ఔద్ పుట్టిన ప్రదేశంగా ప్రసిద్ది చెందింది. కోటలో గల స్మారక నిర్మాణాలలో జగ్మందిర్ ప్యాలెస్ అపారమైన చారిత్రిక ప్రాముఖ్యత కల్గినది. అందమైన కృత్రిమ సరస్సు కిశోర్ సాగర్ లేక్ మధ్యన ఎర్రరాతితో నిర్మించిన అధ్భుతమైన కట్టడం. పర్యాటకులు ఈ ప్యాలెస్ వద్దకు బోట్ల ద్వారా చేరవచ్చు.
ప్రభుత్వ మ్యూజియం, మహారావు మాదోసింగ్ మ్యూజియం ఈ ప్రాంతంలో ఉన్న రెండు ప్రసిద్ధ మ్యూజియములు.
కోట చీరలుగా పేరుపొందిన చీరలు ఈ ప్రాంతంలో నేయబడి విస్తృతంగా ప్రశంసలు అందుకొన్నవి. భారత దేశంలోని వివిధ ప్రాంతాల మహిళల అభిమానమే కాక అంతర్జాతీయ కీర్తిని కూడా ఆర్జించాయి. ఈ చీరలను కోట డోరియా అని కూడా అంటారు - డోరియా అంటే దారం అని అర్ధం ఈ చీరలకు ఒక ఆసక్తికరమైన పుట్టుక ఉంది.
మైసూర్ లో నేసిన ఈ చీరలు చూసి చేనేత పనివారిని మొఘల్ సేనాధిపతి కిషోర్ సింగ్ కోటకు తీసుకొని వచ్చాడని భావిస్తారు. అందువల్లనే ఈ చీర మసూరియా (మైసూర్ నుండి) అనే పేరుతో కోటలో ప్రసిద్ది చెందింది. అయితే దేశంలోని ఇతర ప్రాంతాలలో దీనిని కోట డోరియా అని పిలుస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది నూలు, పట్టులతో చేసిన ఆరు గజాల ఇంద్రజాలం.
కోట చేరుకోవడం యాత్రికులు రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా కోట చేరుకోవచ్చు. జైపూర్ లోని విమానాశ్రయం , కోట రైల్వే స్టేషన్, ఇక్కడికి దగ్గరలో వుంటాయి. కోట నుంచి చిత్తోర్ ఘర్, జైపూర్, అజ్మీర్, జోధ్పూర్, బికానేర్, ఉదయపూర్లాంటి నగరాలకు నిత్యం కోట నుంచి బస్సులు తిరుగుతాయి.
కోట వాతావరణం
బాగా వేడిగా వుండే వేసవి, అతి శీతలంగా వుండే శీతాకాలం కోటలో చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చ్ మధ్య కాలం లోని శీతాకాలం బాగా అనువైనది.