విరాట్ నగర్ ప్రదేశం రాజస్ధాన్ లోని పింక్ సిటీ జైపూర్ నుండి 53 కి.మీ.ల దూరంలో కలదు. ఈ పట్టణం ఇపుడిపుడే పర్యాటకులకు ఒక ఆకర్షణీయ ప్రదేశంగా మారుతోంది. ఈ ప్రదేశాన్ని చాలామంది బైరాత్ అని పిలుస్తారు. దీని సమీపంలో సరిస్కా, శిలిసేర్, అజబ్ ఘర్ - భంగ్రా మరియు ఆల్వార్ లవంటి ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు కలవు. విరాట్ నగర్ పేరు మన గొప్ప ఇతిహాసమైన మహాభారత్ లో కూడా చెప్పబడింది. పురాణేతిహాసాల మేరకు విరాటుని రాజ్యంగా చెబుతారు. పాండవులు తమ అరణ్యవాసం పూర్తయిన తరువాత ఒక సంవత్సరకాలం విరాటునిని రాజ్యంలో ఆజ్ఙాతవాసం పూర్తి చేశారు.
చరిత్ర మేరకు ఈ ప్రదేశం మహా జనపద లేదా పురాత రాజ్యానికి రాజధానిగా ఉండేది. 5వ శతాబ్దంలో ఛేది రాజులు దీనిని పాలించారు. తర్వాతి కాలంలో అది మౌర్య రాజ్యంలో ఒక భాగమైంది. ఇక్కడ పర్యాటకులు అశోకుడి శిలా లేఖనాలు చూస్తారు. మౌర్య రాజు ఇక్కడ తన రాజ్యపాలనకు సంబంధించిన చట్టాలు, ప్రకటనలు శిలా శాసనాలుగా చెక్కించాడు.
పర్యాటకులు విరాట్ నగర్ లో వివిధ కొండలలో కల సహజమైన గుహలను చూడవచ్చు. ఈ గుహలే కాక, భీమ్ కి డుంగారి లేదా పాండు హిల్ వంటి ప్రసిద్ధ ఆకర్షణలు కూడా చూడవచ్చు. ఈ గుహలో భీముడు నివాసం ఉన్నాడని చెపుతారు. దీని సమీపంలో చిన్న గదులు కల గుహలు అతని ఇతర సోదర పాండవులకు కూడా కలవు.
బీజక్ కి పహారి అనేది ఈ ప్రదేశంలో మరో పర్యాటక ఆకర్షణ. పర్యాటకులు ఇక్కడ పురాతన బౌద్ధ ఆరామాలు చూడవచ్చు. గణేశ గిరి దేవాలయం, మ్యూజియం, జైన నాసియా మరియు జైన దేవాలయాలు కూడా విరాట్ నగర ఆకర్షణలే.
వేసవి అయినా, శీతాకాలమైన వాతావరణం అధికంగానే ఉంటుంది. వేసవిలో అధికవేడి, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు కూడా పడిపోతాయి. విరాట్ నగర్ చూడగోరే పర్యాటకులు మార్చి నుండి అక్టోబర్ వరకు శీతాకాలంలో సమయంలో చూడవచ్చు
విరాట్ నగర్ కు వాయు, రైలు, మరియు రోడ్డు మార్గాలలో చేరవచ్చు. జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం విరాట్ నగర్ కు సమీపంలో ఉంది. జైపూర్ రైలు స్టేషన్ వరకు రైలులో చేరవచ్చు. విమానాశ్రయం లేదా రైలు స్టేషన్ నుండి క్యాబ్ లలో విరాట్ నగర్ చేరవచ్చు. కోల్కటా, ముంబై, ఢిల్లీ మరియు చెన్నై ల నుండి విరాట్ నగర్ కు రైలు లేదా వాయు మార్గాలు తేలిక. జైపూర్ నుండి విరాట్ నగర్ కు లగ్జరీ బస్సులు లేదా క్యాబ్ లు కూడా కలవు.