చక్కటి ప్రాంతాలు, మంచు కిరీటాలను ధరించిన పర్వతాలు, పూలపాన్పు వంటి మైదానాలు, అందమైన జలవనరులు, ఇంకా ఎన్నో ఉండి, దాదాపుగా ఒక స్వర్గం అని పేరుపొందినదే ఎంతో అద్భుతమైన సిక్కిం.
సిక్కిం, భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలలో ప్రకృతమైన ప్రకృతి ఉన్న అద్భుత భూమి.
మరియు జీవితకాలంలో ఒక్కసారైనా చూడదగిన సుందర ప్రదేశాలతో ఉన్న రాష్ట్రం. సిక్కింకు తూర్పున భూటాన్, పశ్చిమ దిశలో నేపాల్, ఉత్తరాన టిబెట్ పీఠభూమి ఉన్నాయి.
ఈ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన ప్రాంతం కంచన్ జంగా –ప్రపంచంలోనే మూడవ ఎత్తైన శిఖరం.
ఈ రాష్ట్రంలో 28 పర్వత శిఖరాలు, 227 ఎత్తైన ప్రాంతాలలో ఉన్న సరస్సులు, 80 హిమానీనదాలు ఉన్నాయి. అదనంగా దాదాపు 100 నదులు, పిల్ల కాలువలు, అనేక వేడినీటి బుగ్గలు కూడా ఉన్నాయి. సిక్కింలో వేడి నీటి బుగ్గల 50 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రతతో, చికిత్సాపరమైన శక్తుల వలన అవి ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు.
సిక్కిం ఎంత అందమైనదో, దాని వాతావరణం కూడా అంతే. ఒక క్రమ పద్ధతిలో ప్రతి ఏటా మంచుకురిసే భారతదేశ అతి కొద్ది రాష్ట్రాలలో సిక్కిం రాష్ట్రం ఒకటి. ఎల్లప్పుడు ఒక మోస్తరైన, ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.
ఈ ప్రాంత౦ వాతావరణ పరిస్థితులను ఆహ్లాదకరంగా మార్చే విషయమేమంటే, దీని ఉష్ణోగ్రత వేసవిలో 28 డిగ్రీల సెల్సియస్ కు ఎల్లప్పుడు మించకపోగా, శీతాకాలంలో అది 0 డిగ్రీల సెల్సియస్ ల గడ్డకట్టించే స్థితికి కూడా రాదు. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే౦తగా ఎంతో భారీగా వర్షాలు కురిసినందున వర్షాకాలం మాత్రం కొంత ప్రమాదకరంగా ఉంటుంది
సిక్కిం అతి తక్కువ జనాభా ఉన్న భారతదేశ రాష్ట్రం. గోవా తర్వాత భారతదేశంలో రెండవ అతి చిన్న రాష్ట్రం.
సిక్కింలోని నమ్చి లో సిక్కిం పోషక సాధువు – పద్మసంభవ గురువు అతి ఎత్తైన విగ్రహం, అందమైన రోడోడెండ్రాన్ అభయారణ్యం - అనేక రకాలతో రాష్ట్ర పుష్పానికి చెందిన పవిత్ర ప్రదేశం, కాంచనజంగా – ప్రపంచంలో మూడవ అతి ఎత్తైన శిఖరం, అనేక పవిత్రమైన, శక్తివంతమైన బౌద్ధ సన్యాసుల మఠాలు, అందమైన పచ్చటి లోయలు, నదులు, సిక్కిం ప్రత్యేక వేడి నీటి బుగ్గలు, ప్రశాంతమైన, పర్యావరణ పర్యాటక రంగానికి అనుకూలమైన గ్రామం.
ఆహారపదార్థాలు, పండుగలు మర్చిపోలేనివి. సిక్కిం వంటకాలు, సంస్కృతి అనే రెండు విషయాలు కూడా ఈ చిన్న అందమైన రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థాయిని కల్గించాయి. సిక్కిం ప్రజలకు వరి ప్రధానాహారం. సిక్కింలోని కొన్ని సంప్రదాయ వంటలలో మోమోలు, చౌమెన్, వాంటొన్, ఫక్తు, గ్యాతుక్ లేదా తుక్ప – నూడుల్ ఆధారిత సూపు, ఫగ్షప, చుర్పితో కూడిన నింగ్రో. ఆల్కహాల్ ఆధారిత పానీయాలు కూడా సిక్కిం ప్రజలు ఎక్కువగా తీసుకొంటారు.
స్థానిక బౌద్ధ సిక్కిం వాసులు జరుపుకొనే సాంప్రదాయ పండుగలలో మాఘే సంక్రాంతి, భీమసేన పూజ, ద్రుప్క తెషి, లోసార్, బుమ్చు, సగ దవ, లూసాంగ్ కొన్ని చెప్పుకోదగినవి. ఈ రాష్ట్రం భారతీయ పర్యాటక హాట్ స్పాట్ గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.