header

Tripura Tourism / త్రిపుర పర్యాటకం

Tripura Tourism / త్రిపుర పర్యాటకం

భారతదేశంలోని అందమైన రాష్ట్రాలలో త్రిపుర ఒకటి. ఆకుపచ్చని లోయలు, కొండలతో త్రిపుర భారతదేశంలో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా రూపొందింది. దేశంలోని మూడవ అతిచిన్న రాష్ట్రమైన త్రిపుర ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఒక చిన్న రాష్ట్రం. ఈ రాష్ట్ర౦ పందొమ్మిది దేశీయ తెగల, అలాగే గిరిజన బెంగాలీ ప్రజల సమ్మేళనం.
త్రిపుర 'సెవెన్ సిస్టర్స్' గా ప్రసిద్ధిచెందిన, ఈశాన్య భారతదేశ ఏడు రాష్ట్రాలలో ఒకటి. ప్రధానంగా కొండలు, లోయలు, మైదానాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. త్రిపుర ఇరుకైన లోయలతో ఐదు కొండ ప్రాంతాలుగా విభజించబడింది.
త్రిపుర వాతావరణ౦ దాని ఎత్తుతో ప్రభావితంకాబడి, కొండ, పర్వత ప్రాంత స్థలాలు చాలా వరకు ఒకే విధమైన విశిష్టతలను కలిగి ఉన్నాయి. త్రిపురలో ఉష్ణోగ్రత శీతాకాలంలో షుమారు పది డిగ్రీలకు పడిపోవచ్చు, వేసవి కాలంలో షుమారు 35 డిగ్రీలు వరకు పెరగవచ్చు. జూన్ నెలలో ఈ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయి. త్రిపురలో ఏడాది పొడవునా వివిధ రకాల సాంస్కృతిక సంఘటలను జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే త్రిపురలో వివిధ జాతి-భాష, మత వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతి తెగ తమ సంప్రదాయాన్ని అనుసరించి, అనేక పండుగలను, వేడుకలను జరుపుకుంటుంది.
సందర్శకులు అక్టోబర్ నెలలో వచ్చే దుర్గాపూజ, దీపావళి, జులై నెలలో జరిగే పద్నాలుగు దేవతలను పూజించే కరాచీ పూజ వంటి కొన్ని సందర్భోచిత పండుగలను చూడవచ్చు. గరియ పూజ, కేర్ పూజ, అశోక్ అష్టమి పండుగ, బుద్ధ పూర్ణిమ, పౌస్-సంక్రాంతి మేళా, వాహ్ (దీపం) పండుగ త్రిపురలో జరిగే కొన్ని ఇతర ప్రధాన పండుగలు. త్రిపుర పర్యాటకం నృత్యం, సంగీతం, చేతిపనులు వంటి సాంప్రదాయ కళలను కూడా కలిగి ఉంది. త్రిపురకు చెందిన వివిధ దేశీయ తెగల సంప్రదాయ నృత్యాలు చూడవచ్చు. త్రిపురలో జమటియ ప్రజలు నిర్వహించే గోరియా నృత్యం యొక్క సృజనాత్మకత, అందం గోరియ పూజ సమయంలో చూడవచ్చు.
అదేవిధంగా రియాంగ్ కమ్యూనిటీ యువతులు మట్టితో చేసిన కుండపై తమను తాము నిలుపుకుంటూ చేసే హోజగిరి నృత్యం ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా, లేబంగ్ నృత్యం, మమిత నృత్యం, మోసాక్ సుల్మని నృత్యం, బిజ్హు, హిక్-హక్ నృత్యం మొదలగునవి కూడా ఉన్నాయి.
త్రిపుర తెగలు సరిండ, చోన్గ్ప్రేంగ్, సుముయి వంటి స్థానికంగా ప్రశంస పొందిన సంగీత సాధనాలను తయారుచేస్తారు, వీటితోపాటు హస్తకళలు, ఫర్నిచర్, పాత్రలు, వెదురు, కొయ్యను ఉపయోగించి అలంకరణ వస్తువులను తయారుచేస్తారు.
త్రిపురలోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు కాలుష్యం లేని గాలి, వాతావరణం, ఆశక్తికర పర్యాటక ప్రదేశాలు, ఎవరైనా సందర్శించడానికి త్రిపుర ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. త్రిపురలో సతత హరితారణ్యాల విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. జలవనరులు కూడా ఎక్కువగా ఉన్నాయి.
అగర్తల త్రిపుర రాజధాని నగరం అనేక పర్యాటక ప్రదేశాలను కలిగి ఉంది. జగన్నాధ ఆలయం, ఉమామహేశ్వర ఆలయం, బెనుబాన్ బీహార్/బుద్ధ ఆలయం వంటి ఇక్కడ కనిపించే ఆలయాలు. ఈ ఆలయాలు గొప్ప పురావస్తు చరిత్రను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, అగర్తలా సేపహిజల జూ లో ఉన్న వివిధ రకాల జంతుజాతులను కూడా చూడవచ్చు. యువ ప్రయాణీకుల కోసం అగర్తల రోజ్ వ్యాలీ అమ్యూజ్ మెంట్ పార్క్ ఉంది.
అగర్తలా నుండి కాకుండా, త్రిపుర ధాలై, కైలశాహర్, ఉనకోటి, ఉదయ్ పూర్ వంటి గమ్యస్థానల వద్ద ఇతర పర్యాటక ఆకర్షణలు కూడా ఉన్నాయి. ఉదయ్ పూర్ ప్రసిద్ధ త్రిపుర సుందరి ఆలయం, భువనేశ్వరి ఆలయం వంటి దేవాలయాలతో యాత్రికులను అలరిస్తుంది. కైలాశాహర్ చౌడూ దేవోతర్ మందిర్, అందమైన టీ ఎస్టేట్స్ లను కూడా చూడవచ్చు.
త్రిపురలో ఆసక్తికరమైన కొన్ని ఇతర పర్యాటక స్థలాలు ఉజ్జయంత ప్యాలెస్, త్రిపుర రాష్ట్ర మ్యూజియం, సుకాంత అకాడమీ, లోన్గ్తరై మందిర్, మణిపురి రాస్ లీల, ఉనకోటి, లక్ష్మీ నారాయణ ఆలయం, పురానో రాజ్బరి, నజ్రుల్ గ్రంథాగర్, మబ్బుల చిరుతపులి నేషనల్ పార్క్, రాజ్బరి నేషనల్ పార్క్ ఉన్నాయి.