బృందావనం అనగానే శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తాడు. హిందువులకు ఆరాధనీయ స్థలం. ఈ బృందావనంలోనే శ్రీకృష్ణుడు రాధ , మరియు ఇతర గోపికలతో అద్భుతమైన నాట్యంతో రాసలీలల ప్రదర్శించాడంటారు.
బృందావనం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం అంతే కాకుండా బృందావనం గొప్పతనాన్ని చాటిచెప్పే 5000 దేవాలయాలు ఇక్కడే ఉన్నాయి.
బృందావనం కొంత వరకు ప్రాబల్యాన్ని కోల్పోయింది. తిరిగి 1515 వ సంవత్సరంలో చైతన్య మహాప్రభు ద్వారా తిరిగి వృద్ధిలోనికి వచ్చింది. చైతన్య మహాప్రభు బృందావనం యొక్క పవిత్రమైన అడవులలో తిరుగుతూ ఆధ్యాత్మిక శక్తులతో పట్టణం మరియు చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాలను కనిపెట్టగలిగారు. హిందువులు బృందావనంను వారి జీవితకాలంలో కనీసం ఒకసారైనా దర్శించాలని అనుకుంటారు. ఈ పట్టణంలో ఇప్పటికీ అక్కడి ప్రజలు రాదే కృష్ణా అని అనటం చూడవచ్చు.
మొఘలాయి చక్కవర్తి ఔరంగజేబు కాలంలో ఇక్కడ ఉన్న కొన్ని దేవాలయాలను నాశనం చేయడం జరిగింది.
ప్రముఖ దేవాలయాలు బ్యాంకే బిహారీ దేవాలయం, రంగ్జి ఆలయం, గోవింద్ దేవ్ ఆలయం మరియు మదన్ మోహన్ ఆలయం ఇక్కడే ఉన్నాయి.
దేవాలయాల్లో రాధా గోకులానంద ఆలయం మరియు శ్రీ రాధా రాస్ బిహారీ అష్ట సఖి ఆలయము ముఖ్యమైనవి.
హిందువులు పవిత్ర యమునా నదిలో స్నానం చేయటం ద్వారా అన్ని పాపాలు పోతాయని నమ్ముతారు. యమునా తీరాన సాయంత్రం హారతి కూడా నిర్వహిస్తారు.
బృందావనానికి విమాన , రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. సమీప విమానాశ్రయం ఢిల్లీలో ఉంది.
బృందావనం సందర్శించడానికి నవంబర్ మరియు మార్చి మధ్యలో అనుకూలమైన సమయం..