ఉత్తరప్రదేశ్, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాశి (కాశి) ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. ఉత్తరప్రదేశ్ ఒక పవిత్ర స్థలమే కాకుండా వైష్ణవులకు ఆధ్యాత్మిక కేంద్రం కూడా. శ్రీకృష్ణుని జన్మస్థానం మథుర, శ్రీరాముని జన్మస్థానం అయోధ్య ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి.
బృందావనం, గోవర్ధన గిరి అనగానే శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తాడు అవి కూడా ఇక్కడే ఉన్నాయి. శ్రీరాముడు, సీతాదేవి దంపతుల కుమారులు లవకుశులు జన్మించిన స్థలం బితూర్. మహాభక్తులైన కబీర్, తులసీదాస్, సూరదాస్ లు ఉత్తరాఖండ్ కు చెందినవారే. ఇక అలహాబాద్ అతి పురాతనమైన నగరాలలో ఒకటి. గంగ, యమున, సరస్వతి సంగమించిన ప్రదేశం అలహాబాదే.
ఇక్కడ జరిగే కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక, ధార్మిక పర్యాటకులు వస్తారు. బౌద్ధులకు ఇది ఎంతో ముఖ్యమైన ప్రదేశం ఎందుకంటే బుద్ధుడు తన మొదటి ప్రవచనాలు బోధించినది ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ లోనే.
ఇక్కడ అశోకుని స్థూపం ఉండటమే కాక బుద్దభగవానుడు ఎన్నో ప్రవచనాలు బోధించిన ప్రదేశం కౌశాంబి, శ్రావస్తి కూడా బౌద్ధులకు పవిత్రస్థలాలు. బుద్ధుడు నిర్యాణం చెందిన కుషినగరం ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. ప్రభాస్ గిరి హిందువులకు, జైనులకు ఇద్దరికీ ముఖ్యమైంది.
Jhancy / ఝాన్సీ
Ayodhya / అయోధ్య
Brundavanam / బృందావనం
Lucknow / లక్నో
Madhura / మథుర
Saranath / సారనాథ్
Varanasi (Kasi) వారణాసి (కాశి)
నైమిశారణ్యం / Naimisaranyam
Fatehpur Sikri Fort, Agra…ఫతేపూర్ సిక్రీ కోట - ఆగ్రా