ఝాన్సీ, ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ కి ముఖద్వారం.
1857 సం.లో బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా మొట్ట మొదటి స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన ఝాన్సీ రాణిలక్ష్మీ బాయి పేరుతో ఈ ప్రాంతం ప్రసిద్ది చెందినది.
ఝాన్సీ కి చెందిన రాజా గంగాధర్ ని వివాహమాడిన లక్ష్మీబాయి దంపతులకు మగబిడ్డ పుట్టి చనిపోతాడు. వీరు ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంటారు. కానీ ఈ దత్తత చెల్లదంటూ బ్రిటిష్ వారు ఝాన్సీ లక్ష్మీబాయిని రాణీ పదవి నుండి తొలగమని ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటీష్ వారికి అప్పగించమని ఒత్తిడి తెస్తారు. దీనికి ఆమె వ్యతిరేకించి బ్రీటీష్ వారిపై తిరుగుబాటు చేస్తుంది. 1857లో బ్రీటీష్ వారితో జరిగిన యుద్ధంలో తన పెంపుడు పిల్లాడితో సహా తప్పించుకున్న ఝాన్సీ రాణి గ్వాలియర్ చేరుకుని అక్కడ జరిగిన యుద్ధంలో కన్నమూసింది.
జాన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియాగా ఝాన్సీ రాణిని గౌరవిస్తారు. ఝాన్సీ జ్ఞాపకార్ధం ఇక్కడ ప్రతి ఏడు ఫిబ్రవరి-మార్చ్ లో ఝాన్సీ ఫెస్టివల్ జరుపుతారు.
ఝాన్సీ లో ఉన్నవి ప్రదేశాలు చారిత్రక ప్రాధాన్యం కలిగినవి. రాణీ లక్ష్మీబాయి మరియు బ్రిటిష్ వారికి జరిగిన యుద్దానికి వేదికగా నిలిచిన అద్భుతమైన ఝాన్సీ కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
ఇక్కడే ఉన్న అందమైన పరిచా డ్యాం సందర్శించవచ్చు. మరియు ఇక్కడ ఉన్న ఒక కాలనీలో ప్రసిద్దమైన ఆలయం, మసీదు మరియు బౌద్ధుల ఆశ్రమం చూడవచ్చు. ఇక్కడి ఝాన్సీ మ్యూజియంలో ఒకప్పటి ఝాన్సీ వైభవాన్ని చూడవచ్చు. రాణి లక్ష్మీబాయి నివసించిన రాణీమహల్ అనే భవనాన్ని చూడవచ్చు. బెట్వా నది ఒడ్డున ఉన్న బారువా సాగర్ సరస్సు కూడా సందర్శించదగినదే.
ఇక్కడ ఓర్చా కోట ప్రసిద్ది చెందినది. అలాగే ఇక్కడి సివిల్ లైన్స్ వద్ద ఉన్న సెయింట్ జూడ్స్ స్రైన్ క్యాధలిక్ క్రైస్తవులకు ముఖ్యమైనది. మహారాజా గంగాధర్ రావుకి ఛత్రి, గణేష్ మందిర్ మరియు మహాలక్ష్మి టెంపుల్ కూడా పేరుపొందిన పర్యాటక ప్రదేశాలు. ఈ మధ్యే ప్రవేశ పెట్టిన ఝాన్సీ మహోత్సవ్ లో అనేక కళలు మరియు కళాకృతులు ప్రదర్శింపబడతాయి.
నవంబర్ నుండి మార్చ్ వరకు ఝాన్సీ ని సందర్శించేందుకు అనుకూలంగా ఉంటుంది
ఝాన్సీ కి విమాన, రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడికి అతి దగ్గరలో ఉన్న విమానాశ్రయం గ్వాలియర్ విమానాశ్రయం.