మథుర నగరానికి బ్రిజ్ భూమి లేదా ‘అంతు లేని ప్రేమ కల భూమి‘ అని గతంలో పేరు. ఇపుడు కూడా అలాగే పిలుస్తున్నారు.
మధుర పట్టణం హిందువులకు ప్రధాన యాత్రాస్థలం. ఇక్కడ శ్రీకృష్ణుడు, అతని ప్రియురాలు రాధకు సంబంధించి అనేక దేవాలయాలు కనపడతాయి. 8వ శతాబ్దంలో ఈ ప్రాధాన్యతను బయటపడక ముందు ఈ పట్టణం బౌద్ధులకు సంబంధించినది. బౌద్ధమతానికి చెందిన అనేక బౌద్ధ ఆరామాలలో సుమారు ౩,౦౦౦ మంది బౌద్ద సన్యాసులు వుండేవారు.
ఆఫ్ఘన్ ప్రభువు మహమ్మద్ గజినీ ఆ తర్వాత16వ శతాబ్దంలో ఔరంగజేబ్ ఈ పట్టణంపై దండెత్తి అనేక ప్రసిద్ధ దేవాలయాలను, కేశవదేవ్ టెంపుల్ మరియు అక్కడే నిర్మించిన ఒక మసీదులతో సహా కూలగొట్టించారు.
మధురకు 365 రోజులు యాత్రికులు వస్తూనే వుంటారు. ప్రత్యేకించి, హోలీ, మరియి జన్మాష్టమి అంటే శ్రీ కృష్ణుడి పుట్టిన రోజున భక్తులు ఈ పట్టణానికి మరింత అధిక సంఖ్యలో వస్తారు.
యమునా నది ఒడ్డున కల మధుర భారతీయ సంస్కృతి మరియు నాగరికతలకు కేంద్రం. భారతదేశంలోని చాలా మంది ప్రశాంత జీవనం గడపటానికి ఇక్కడ కల ఆశ్రమాలకు వస్తారు. మధురను హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు కూడా పవిత్రంగా భావిస్తారు.
ఇక్కడ ఉన్న శ్రీ కృష్ణ జన్మ భూమి దేవాలయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. మధుర ఆకర్షణ అంతా కృష్ణుడితో ముడిపడి వుంది.
మరొక ప్రదేశం విశ్రాం ఘాట్, ఇక్కడ శ్రీకృష్ణుడు తన మేన మామ అయిన కంసుడిని వధించిన తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకున్నాడని అంటారు. ఇక్కడ కల ద్వారకదీష్ టెంపుల్ ప్రధాన ఆలయం. హిందూ పండుగలలో ఈ ఆలయాన్ని అతి వైభవంగా అలంకరిస్తారు. హిందువుల పండుగలు అయిన, శ్రీకృష్ణ జన్మాష్టమి, గీతా మందిర్ వంటివి అతి వైభవంగా ఆచరిస్తారు.
ఇక్కడ డేమ్పియర్ పార్క్ లో ఉన్న ప్రభుత్వ మ్యూజియంలో గుప్తుల కాలం నుండి కుషాన్ రాజుల కాలం వరకూ అంటే సుమారు క్రి.పూ.400 సంవత్సరాల నుండి క్రి.శ.1200 సంవత్సరాల వరకూ సేకరించిన అనేక చారిత్రక వస్తువులు వుంటాయి.
కాంస్ కిలా, పోతన కుండ్, మధుర లోని ఘాట్ లు చూడదగినవి. మధురకు వెళ్ళేటపుడు, పక్కనే కల బృందావనం నగరం కూడా తప్పక చూడాలి.
మధురలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు, పండుగలు జరుగుతుంటాయి కనుక ఎపుడైనా సందర్శించవచ్చు.
మధుర ఎలా వెళ్లాలి ?
మధురకు రైలు, రోడ్డు, విమాన మార్గాలు కలవు. ఢిల్లీ, మధుర పట్టణానికి సమీపాన గల పెద్ద నగరం.