header

Uttar Pradesh / ఉత్తరప్రదేశ్

Uttar Pradesh / ఉత్తరప్రదేశ్

పురాణాలలో ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతాల ప్రస్తావన ఉంది. భారతదేశంలోని రెండు గొప్ప ఇతిహాసాలు రామాయణ, మహాభారతాలు జరిగిన చారిత్రాత్మక స్థలం ఉత్తరప్రదేశ్.
ఇక పర్యాటకపరంగా మనోహరమైన చారిత్రాత్మక కట్టడాలతో ఉత్తరప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది తాజ్ మహల్ చూడటానికి విదేశీయులు సహితం అధిక సంఖ్యలో వస్తారు. ఝాన్సీ, లక్నో, మీరట్, అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీ, ప్రతాప్ గడ్, బారాబంకి, జౌన్ పూర్, మహోబా మొదలగునవి మరియు ఒక చిన్న వ్యవసాయిక గ్రామం అయిన దియోగడ్ మొదలైనవి ఉత్తర ప్రదేశ్ చరిత్ర, సంస్కృతుల కథలను తెలిపే ప్రాంతాలు.
ఉత్తరప్రదేశ్ లోని అలీగడ్ విశ్వవిద్యాలయం పేరుపొందిన విశ్వవిద్యాలయం. వారణాసి, లక్నో, మీరట్, ఝాన్సీ, ఘజియాబాద్, కాన్పూర్, గోరఖ్ పూర్, నోయిడా మొదలైనవి ఉత్తర ప్రదేశ్ లో పర్యాటక పరంగా కొన్ని ముఖ్య ప్రాంతాలు.
ఉత్తర ప్రదేశ్ లో వన్యప్రాణులు, అరణ్యాలు, రాయ్ బరేలిలోని సమస్ పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం, చంబల్ వన్యప్రాణి అభయారణ్యం, దుధ్వ జాతీయ పార్కు వంటివి వన్యప్రాణి ఔత్సాహికులకు స్వాగతం పలుకుతాయి..
ఉత్తరప్రదేశ్ సంస్కృతి, వంటకాలకు, ఆచారాలకు పేరు. భారతదేశంలోని ప్రసిద్ధ నృత్య రూపాలలో ఒకటి కథక్ ఉత్తర ప్రదేశ్ లోనే పుట్టింది. చేతితో ముద్రణ పనులు, కార్పెట్ తయారీ, లోహపు పూత, బంగారు జలతారు పని, ఇత్తడి, నల్లచేవ మాను పని తదితర ఎన్నో రకాలైన, పేరొందిన చేతివృత్తులకు కూడా ఉత్తరప్రదేశ్ పేరు పొందినది. ఒక ప్రత్యేక తరహా ఎంబ్రాయిడరి లక్నొవీ చికన్ ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకొంది.
రాష్ట్రంలోని అనేక కట్టడాలలోనే కాక వంటకాలలో కూడా ఉత్తర ప్రదేశ్ సంస్కృతిలో హిందూ, మొఘలాయి సంస్కృతుల మేళవింపు ప్రతిబింబిస్తుంది.
అవధి వంటకాలు, కబాబులు, దమ్ బిర్యాని, ఇతర మాంసాహార వంటలు వంటి కొన్ని వంటకాలను పర్యాటకులు ఇష్టపడతారు. నోరూరించే అల్పాహారాలైన చాట్ లు, సమోసాలు, పకోడాలు ఉత్తర ప్రదేశ్ లో పుట్టినవే.