దేవ్ ప్రయాగ్ ఉత్తరాఖండ్ లో టెహ్రీ గార్వాల్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధమైన యాత్రాస్థలం. దేవ్ ప్రయాగ్ అనే సంస్కృత పదంనకు 'పవిత్ర కూడలి' అని అర్థం.ఈ పట్టణం అలకానంద మరియు భాగీరథి నదుల సంగమం వద్ద ఉంది. 7 వ శతాబ్దంలో ఈ ప్రదేశంను బ్రహ్మపురి, బ్రాహమ్ తీర్థ్ మరియు శ్రీఖండ్ నగర్ అనే రక రకాల పేర్లతో పిలిచేవారు. అలాగే, 'ఉత్తరాఖండ్ రత్నం' అని కూడా పిలుస్తారు.
ఈ పవిత్ర పట్టణంను పంచ్ ప్రయాగ అని కూడా పిలుస్తారు ఐదు పవిత్రమైన నదులు సంగమించే ప్రదేశానికి-మధ్య ఐదో స్థానంలో ఉంది. మిగత నాలుగు విష్ణు ప్రయాగ, రుద్ర ప్రయాగ, నంద ప్రయాగ, మరియు కర్ణ ప్రయాగ. వీటితో పాటు పట్టణంలో రఘనాథ్ ఆలయం, చన్ద్రబదని ఆలయం మరియు దశ్రత్శిల ఆలయం అనే పురాతన మైనవి. ఈ ప్రదేశంలో భాగీరథి నది మరియు అలకానంద నదిపై నిర్మించిన రెండు గొలుసు వంతెనలు ప్రసిద్ధి చెందాయి.
దేవ్ ప్రయాగ్ కు విమాన, రైలు,రోడ్డు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు. సమీప విమానాశ్రయం డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. దేవ్ ప్రయాగ్ కు దగ్గరగా 94కి. మీ.ల దూరంలో హరిద్వార్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది లక్నో, ముంబై, న్యూ ఢిల్లీ, మరియు డెహ్రాడూన్ సహా భారతదేశం యొక్క ప్రధాన నగరాలకు రైలుమార్గం ద్వారా అనుసంధానించబడింది.
ఈ పవిత్ర పట్టణంలో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. యాత్రికులు ఏడాది పొడవునా దేవ్ ప్రయాగ్ ను సందర్శించవచ్చు.