ఉత్తరాఖండ్ ఉత్తర భారత దేశంలోని ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దేవతల భూమిగా ప్రసిద్ధి కెక్కిన ఉత్తరాఖండ్ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఉత్తరాఖండ్ కు ఉత్తరాన టిబెట్, తూర్పున నేపాల్ దేశాలు సరిహద్దులు . దక్షిణదిశలో ఉత్తరప్రదేశ్ మరియు నైరుతి హద్దులో హిమాచల్ ప్రదేశ్ లు ఉన్నాయి. ఇదివరకు దీనిని ఉత్తరాంచల్ అనేవారు. జనవరి 2007 నాటి నుండి ఉత్తరాంచల్ పేరును ఉత్తరాఖండ్ గా మార్పుచేసారు.
పర్వత ప్రాంతాలు , మైదానాలు కలిగిన ఈ ప్రాంత పర్యటనకు వేసవి కాలం అనుకూలమైనది. శీతాకాలంలో కూడా పర్యటించవచ్చు. అయితే, ఈ కాలం లో కొన్ని ప్రాంతాలు అధిక మంచుతో కప్పబడి పర్యటనకు అసౌకర్యం కలిగిస్తాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అధికార భాష హిందీ. అయితే వివిధ ప్రాంతాలలో స్థానిక భాషలు మాట్లాడతారు. కుమావొనీ మరియు గర్హ్వాలి భాషలు ప్రధానమైనవి. కొన్ని ప్రాంతాలలో పహారీ భాష మాట్లాడతారు.