ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉన్న గోముఖ్ గంగోత్రి హిమానీనదంనకు చివరిగా ఉన్న అందమైన ప్రదేశం. గంగా నది యొక్క ముఖ్య ఉపనది భాగీరథి నది గోముఖ్ వద్ద పుట్టింది. ఈ స్థలం తపోవనం పచ్చికబయలుకి దగ్గరలో ఉంది. ఇది సందర్శకులను తన సహజ సౌందర్యంతో ముగ్దులను చేస్తుంది.
పర్యాటకులు గోముఖ్ లో అనేక పర్యాటక ప్రదేశాలు చూడవచ్చు. గంగోత్రి హిమానీనదం వాటిలో ప్రముఖమైనది. ఇది హిమాలయ ప్రాంతం యొక్క అతిపెద్ద హిమానీనదాలలో ఒకటి. ఇది శివలింగం, తలయ సాగర్, మేరు మరియు భాగీరథి-3 అనే మంచుతో కప్పబడిన శిఖరాలతో చుట్టబడి ఉంది. హిమానీనదం యొక్క చివరి భాగం ఆవు నోరుని పోలి ఉండటం వల్ల, ఈ స్థలం గోముఖ్ అనగా ఆవు నోరు అని పిలవబడుతుంది.
ప్రత్యేక ట్రెక్కింగ్ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రముఖ పర్వతారోహణ మార్గం గంగోత్రి వద్ద ప్రారంభమయి గిలా పహార్ మరియు చిర్బాసా గుండా వెళుతుంది. ఇది భూపాతాలు మరియు అధిక వాలు ప్రాంతాలతో నిండిన క్లిష్టమైన మార్గం. తపోవనం,నందనవనంకి ట్రెక్కింగ్ కూడా గోముఖ్ వద్దే ప్రారంభమవుతుంది.
పర్యాటకులు డెహ్రాడూన్ యొక్క జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి ఇక్కడికి చేరుకోవచ్చు. గంగోత్రి నుండి సమీప రైల్వే స్టేషన్ 230 కి.మీ.ల దూరంలో ఉన్న హరిద్వార్ . బస్సులు అందుబాటులో ఉన్నాయి. గోముఖ్ పర్యటనకు ఆసక్తి చూపే యాత్రికులు వేసవిలో ఈ స్థలాన్ని సందర్శించడం మంచిది.