header

Mussoorie / ముస్సోరీ

Mussoorie / ముస్సోరీ

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో ముస్సోరీని 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని అంటారు. ఈప్రదేశం అక్కడ కల శివాలిక్ పర్వత శ్రేణుల సుందర దృశ్యాలకు ప్రసిద్ధి గాంచినది. యమునోత్రి మరియు గంగోత్రిలకు ముస్సోరీ ఒక గేట్ వే. 'మాన్సూర్ ' అనే ఒక ఔషధ మూలిక మొక్కలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఈ ప్రదేశాన్ని 'మాన్సూరి' అని పిలుస్తారు.
అందమైన ప్రదేశాలు ఉన్న ఈ పట్టణంలో అనేక పురాతన ఆలయాలు, కొండలు, జలపాతాలు, లోయలు, వైల్డ్ లైఫ్ శాంక్చురిలు మరియు విద్యాసంస్థలు ఉన్నాయి. జ్వాలాదేవి టెంపుల్, నాగ దేవత టెంపుల్ మరియు భాద్రాజ్ టెంపుల్ వంటివి ముస్సూరీ లో కొన్ని ప్రసిద్ధి చెందిన యాత్రాస్థలాలు. జ్వాలాదేవి దేవాలయంలో ఉన్న దేవత దుర్గాదేవి అవతారం.
గుడిలోని విగ్రహం రాతితో చెక్కబడినది. ఇక్కడే కల మరొక ఆకర్షణ నాగ దేవత ఆలయం. ఈ ఆలయం సర్పరాజు నాగదేవత కు చెందినది. భక్తులు ఈ ఆలయానికి నాగ పంచమి నాడు అధిక సంఖ్య లో వస్తారు. గన్ హిల్, లాల్ తిబ్బ, మరియు నాగ తిబ్బాలు అనే సుందరమైన కొండలకు ప్రసిద్ధి ఈ ప్రదేశం ప్రసిద్ధి. గన్ హిల్ సముద్ర మట్టానికి 2122 మీటర్ల ఎత్తున కలదు. ముస్సూరీ లో రెండవ అత్యధిక ఎత్తు కల ఈ కొండకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలదు.
స్వాతంత్రం రాక ముందు, ఈ హిల్ స్టేషన్ నుండి ఒక ఫిరంగిని ప్రతి రోజూ మధ్యాహ్నం వేళ స్థానికులకు సమయం తెలిపేందుకు పేల్చే వారు. అపుడు అక్కడి స్ధానిక ప్రజలు వారి గడియారాలలో సమయం సరి చేసుకునే వారు. ప్రస్తుతం, ఈ కొండపై ముస్సూరీ నగర నీటి అవసరాలు తీర్చే నీటి రిజర్వాయర్ నిర్మించబడినది. గన్ హిల్ కు గల రోప్ వే ప్రయాణం టూరిస్టులకు ఒక ఆసక్తి. ముస్సూరీ లో లాల్ దిబ్బ అత్యధిక ఎత్తు కలది. దీనిని అక్కడ ఒక డిపో వున్నా కారణం గా డిపో హిల్ అంటారు.
ఆకాశవాణి కేంద్రం మరియు దూరదర్శన్ ల టవర్లను ఇక్కడ కట్టారు. ఈ కొండపై ఇండియన్ మిలిటరీ సర్వీసెస్ కూడా వున్నాయి. 1967లో ఈ కొండపై ఒక జపాన్ దేశానికి చెందిన టెలీస్కోప్ ఏర్పాటుచేయటం జరిగింది. దీని ద్వారా టూరిస్టులు సమీప ప్రదేశాలైన బందేర్పంచ్, కేదార్నాథ్, మద్రీనాత్ వంటి వాటిని చూడవచ్చు. ముస్సోరీలో నాగదిబ్బ మరొక ప్రసిద్ధ హిల్. దీనిపై ఒక సర్పశిఖరం ఉన్నది.

పర్యాటకులకు ఇక్కడ అనేక సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదేశం లో కేమ్ప్తి అనే అందమైన జలపాతాలు కలవు. ఝారి పాణి ఫాల్స్, భట్టాఫాల్స్ మరియు మోస్సి ఫాల్స్ కూడా ప్రసిద్ధి. కెంప్ టి ఫాల్స్ సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తున కలవు.
ముస్సూరీ వచ్చినవారు ఈ వాటర్ ఫాల్స్ తప్పక చూసి ఆనందిస్తారు. ఝారిపాని ఫాల్స్ కూడా ప్రసిద్ధి గాంచినదే. ఝారిపాణి గ్రామంలో కల ఈ జలపాతాలు సాహస ప్రియులకు ఒక గొప్ప ఆకర్షణ.భట్ట ఫాల్స్ మరియు మోస్సి ఫాల్స్ రెండూ ముస్సూరీ నుండి 7 కి. మీ. ల దూరంలో ఉన్నాయి.
అందమైన పర్యాటక ప్రదేశమే కాక ముస్సూరీ విద్యాసంస్థలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ అనేక యురోపియన్ స్కూల్స్ వలస కాలం నాటివి. ఈ ప్రదేశం కొన్ని ఉత్తమ మరియు పురాతన బోర్డింగ్ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో సెయింట్ జార్జ్, ఓక్ గ్రోవ్, వైన్ బెర్గ్ అల్లెన్ ప్రసిద్ధిచెందినవి. ముస్సూరీ దేశంలోని ఇతర ప్రాంతాలకు వాయు, రైలు, రోడ్ మార్గాలతో కలుపబడి వుంది. ఈ ప్రదేశానికి సమీప విమానాశ్రయం డెహ్రాడూన్లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ . ఇది ముస్సూరీ కి సుమారు 60 కి. మీ. ల దూరంలో కలదు.
ముస్సూరీ లో వాతావరణం అన్నికాలాలలోను ఆహ్లాదకరంగా వుంది ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు. అయితే, ముస్సోరీ సందర్శనకు వాతావరణం మార్చి నుండి జూన్ వరకు మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకూ అనుకూలంగా ఉంటుంది.