header

Nainital / నైనిటాల్

Nainital / నైనిటాల్

హిమాలయ శ్రేణులలోని కుమావొన్ హిల్స్ మధ్య భాగంలో ఉన్న నైనిటాల్ భారత దేశపు సరస్సుల జిల్లాగా పిలువబడుతుంది.
అత్రి, పులస్త్య, మరియు పులాహ ఋషులు ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తూ దాహం తీర్చుకునేందుకు గాను నైనిటాల్ వద్ద ఆగారు. వారికి ఆ ప్రాంతంలో నీరు లభించలేదు. వెంటనే వారు ఒక పెద్ద గొయ్యి తవ్వి దానిలోకి మానస సరోవరం నీటిని నింపి దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనిటాల్ సరస్సు సృష్టించబడింది. మరో కధనం ప్రకారం ఇక్కడ శివుడి భార్య అయిన సతి యొక్క ఎడమ కన్ను పడి ఆ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడింది.
నైనిటాల్ సందర్శనకు వెళ్లిన వారు హనుమాన్ ఘర్ కూడా తప్పక చూడాలి. దీనితో పాటు ఇండియాలోని 51 శక్తి పీఠాలలో ఒకటి అయిన నైనా దేవి టెంపుల్ కూడా తప్పక చూడాలి. నైనిటాల్ నుండి 10 కి.మీ. ల దూరంలో కల అందమైన పిక్నిక్ ప్రదేశం కిల్ బరీ కూడా చూడదగినది.
పచ్చటి ఓక్, పైన్ మరియు రోడోడెండ్రాన్ అడవులు ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి విశ్రాంతి ప్రదేశాలు. ఈ అడవులలో సుమారు 580 జాతులకు పైగా వివిధ రకాల వృక్షజాతులు, రంగు రంగుల పక్షులు కలవు. లాండ్స్ ఎండ్ ప్రదేశం ఖుర్పతాల్ లేక్ అందమైన దృశ్యాలతో ముగ్దులును చేస్తుంది. ఇది పచ్చటి వాలీ మరియు నైనిటాల్ చుట్టూ వున్నా కొండల అందాలు కూడా చూపుతుంది. టూరిస్టులు ఒక రోప్ వే ద్వారా ఈ ప్రదేశంలోని కొండప్రాంతాలను చేరవచ్చు. ఈ రోప్ వే సుమారు 705 మీటర్ల దూరం కవర్ చేస్తుంది.
రోప్ వే కేబుల్ కార్ ద్వారా స్నో వ్యూ తేలికగా చేరవచ్చు. స్నోవ్యూ నుండి హిమాలయాల అందాలు అద్భుతంగా కనపడతాయి. నైనా శిఖరాని చైనా శిఖరం అని కూడా అంటారు. ఇది నైనిటాల్ లో ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 2611 మీ. ల ఎత్తున కలదు. దీనిని చేరాలంటే, గుర్రాలపై వెళ్ళాలి.
టిఫిన్ టాప్ లేదా డొరొతి సీట్ అనేది ఒక పిక్నిక్ ప్రదేశం. టూరిస్టులు ఎంతో నచ్చిన ప్రదేశం.
ఇక్కడే ఒక ఈకో కేవ్ గార్డెన్ ఉన్నది. ఇది మరొక పేరొందిన ప్రధాన ఆకర్షణీయమైనది.
నైనిటాల్ లో రాజ్ భవన్, జూ, ది ఫ్లట్ట్స్, ది మాల్, సెయింట్ జాన్ ఇన్ ది విల్దెర్నెస్స్ చర్చి, పాన్గోట్ లు ఇతర ప్రధాన ఆకర్షణలు. టండి సడక్, గుర్నీ హౌస్, ఖుర్పతాల్, గుఅనో హిల్స్, మరియు అరబిందో ఆశ్రమం వంటి ప్రదేశాలు కూడా తప్పక చూడదగినవి.
ఇంతేకాక , టూరిస్టులకు ఇక్కడ హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్, బోటింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయి. నైనిటాల్ కు రోడ్, రైల్ మరియు విమాన మార్గాలలో దేశం లోని వివిధ ప్రాంతాల నుండి వెళ్లవచ్చు. అందమైన ఈ ప్రదేశాన్ని వేసవిలో సందర్శించేందుకు అనుకూలం.