header

UttaraKhand Tourism / ఉత్తరాఖండ్ పర్యాటకం

UttaraKhand Tourism / ఉత్తరాఖండ్ పర్యాటకం

ఉత్తరాఖండ్ లో యాత్రాస్థలాలు, ట్రెక్కింగ్ మరియు రాఫ్టింగ్ వంటి ప్రదేశాలు ఎన్నో కలవు.
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సరస్సుల జిల్లాగా ప్రసిద్ధి చెందినది. నైనిటాల్ సముద్ర మట్టానికి 1938 మీ. ల ఎత్తున కల ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ చిన్న భూతల స్వర్గాన్ని బ్రిటిష్ వారు 1841లో విశ్రాంతి విడిదిగా అభివృద్ధి పరచారు. 'నైని' అనే పదం హిందూ దేవత పేరు . ఇది సరస్సు ఒడ్డున ఉన్నది. నైనిటాల్ ప్రదేశం పర్యాటకులకు బోటింగ్, యాచింగ్, ఫిషింగ్ క్రీడలు అందుబాటులో ఉన్నాయి. నైనిటాల్ చుట్టపట్ల కల ఆకర్షణీయ ప్రదేశాలు కూడా ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రదేశాలలో హనుమాన్ గారి, ఖుర్పతల్, కిల్బురి, లరియకాంత, లాండ్స్ ఎండ్ వంటివి కొన్ని ప్రధానమైనవి. ఈ ప్రదేశాలే కాక, నైని శిఖరం, స్నో వ్యూ, నైనిటాల్ రోప్ వే, భిమ్తాల్, నౌకుచియ తాల్, సాత్ తాల్ వంటివి మరి కొన్ని అందమైన ప్రదేశాలు.
అందమైన ముస్సూరీ ని 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని అంటారు. ఇక్కడి పచ్చటి కొండలు, మంచుచే కప్పబడిన హిమాలయ పర్వతాలు, దక్షిణ దిశగా వీటి వెనుక కల డూన్ వాలీ పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. యమునా బ్రిజ్ , నాగ్ టిబ్బా , ధనోల్తి మరియు సుర్ఖండా దేవి ముస్సూరీ చుట్టూ కల ఆకర్షణీయ ప్రదేశాలు.
కౌసానిలో అద్భుతమైన ప్రదేశాలు కాత్యూరి వాలీ, గోమతి నది, పంచాచూలి మంచు శిఖరాలు, నందా కోట్, నందా దేవి, త్రిశూల్, నందా ఘుంటి, చౌఖంబా, మరియు పవిత్ర పుణ్య క్షేత్రా కేదార్ నాథ్ లను చూడవచ్చు. సహజమైన అందాలకు, వన్య జీవులకు పేరు గాంచిన ప్రదేశాలు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, కేదార్నాథ్ శాంక్చురిలు తప్పక చూడవలిసిన ప్రదేశాలు. గోవింద్ వైల్డ్ లైఫ్ శాంక్చురి, అస్సన్ బ్రజ్ బర్డ్ శాంక్చురి, నందా దేవి నేషనల్ పార్క్, ఆస్కోట్ వైల్డ్ లైఫ్ శాంక్చురిల సందర్శన మరువలేనిది.
ఆదికైలాష్, అల్మోర, అగస్త్యముని, బద్రినాథ్, దేవప్రయాగ్ ద్వా రహాట్, గంగ్నాని, గంగోలిహాట్, గంగోత్రి మరియు గౌరికుండ్ వంటి ప్రదేశాలలలో పర్యాటకులు మతపర క్రతువులు చేస్తారు. హరిద్వార్, కేదార్నాథ్, రుద్రనాత్, కల్పేశ్వర్ మరియు జగేశ్వర్ ప్రదేశాలు వీటిలో మరికొన్ని. ట్రెక్కింగ్, పర్వతారోహణ, స్కీయింగ్, మరియు రివర్ రాఫ్టింగ్, బైకింగ్, పేరా గ్లైడింగ్, కామ్పింగ్ వంటి వాటికి హిమాలయ, కారకోరం పర్వత శ్రేణులు ఎంతో అనుకూలమైనవిగా ప్రసిద్ధి చెందాయి.