
పొయ్యి మీద టీ, పాలూ వంటివి పెట్టి మర్చిపోయి అరనిమిషం ఆలస్యం అయినా అవి పొంగి ఒలికిపోతాయి. వెంటనే శుభ్రం చేస్తే ఫర్వాలేదు లేదంటే ఎండిపోయి ఇబ్బందవుతుంది. ఆ తర్వాత పొయ్యినీ, గట్టునీ శుభ్రం చేసుకోవడానికి చాలా సమయమే పడుతుంది. తరచూ ఎదురయ్యే ఈ సమస్యకు స్పిల్ స్టాపర్ సరైన పరిష్కారం. పొంగే వాటిని పొయ్యి మీద ఉంచినప్పుడు ఒలికిపోకుండా దీన్ని మూతగా పెట్టుకుంటే సరిపోతుంది. సిలికాన్‌తో చేసిన ఈ గుండ్రని మూతకి మధ్యలో విడదీసి పెట్టుకోవడానికి వీలుగా ఒక పువ్వు ఉంటుంది. పాలూ, లేదా టీ పొంగినప్పుడు వేడి ఆవిర్లు ఆ పువ్వు నుంచి బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల అవి పొంగినా ఒలికిపోకుండా ఆ మూతలోనే ఉంటాయి. అది సిలికాన్‌కాబట్టి వేడికీ పాడవ్వదు. తరవాత శుభ్రం చేసుకోవడమూ తేలిక.
For Spill topper click here / ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......