header

Anga Stambhana

దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలు/సమస్యలు/సుఖఃరోగాలు వీటన్నిటిని గురించిప్రఖ్యాత వైద్యుల వివరణ...
వీటిని గురించి వివరించటం మాత్రమే జరిగింది....వాటిని అనుసరించేముందు అనుభవజ్ఙులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. సొంతవైద్యం పనికిరాదు. ఇందులోని వివరాలు కేవలం అవగాహనకొరకు మాత్రమే


....డాక్టర్ సుధాకర్ కృష్ణమూర్తి....

అంగ స్తంభన

వయసుతో పాటు ..
వయసుతో పాటు టెస్టోస్టిరాన్‌ స్థాయులు తగ్గుతాయి. శృంగార వాంఛలు తగ్గుతాయి. రక్తనాళాల్లో వయసుతో పాటు ఎంతోకొంత మార్పులు వస్తాయి కాబట్టి స్తంభనలూ కొంత తగ్గుతాయి. మెసాచుసెట్స్‌ అధ్యయనంలో 40 ఏళ్లు పైబడిన పురుషుల్లో 52 శాతం మందికి ఎంతోకొంత స్తంభన తగ్గుతుందని గుర్తించారు. అయితే ఇది ‘స్తంభన లోపం’గా గుర్తించేంత స్థాయికి చేరుకుందా? లేదా? అన్నది కీలకాంశం. చికిత్స..
మందులు: స్తంభన లోపానికి ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ‘వయగ్రా’ సమర్థంగా పనిచేస్తున్నట్టు నిరూపణ అయ్యింది. దీనితో దుష్ప్రభావాలూ చాలా తక్కువ. సరైన మోతాదులో వేసుకుంటున్న వారిలో 70-80% మందిలో మంచి ఫలితాన్నిస్తోంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో తగు మోతాదులో సరైన క్రమంలో వాడుకోవటం తప్పనిసరి. వయగ్రా తాత్కాలికంగా పనిచేసే మందే గానీ శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించేది కాదని గుర్తించాలి. సమస్యను బట్టి హార్మోన్‌ మాత్రల వంటివీ అవసరమవుతాయి. * వయగ్రాతో ఫలితం లేని కొందరికి సర్జరీలూ అవసరమవుతాయి. శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించుకోవాలంటే ‘పీనైల్‌ ప్రోస్థెటిక్‌ ఇంప్లాంటేషన్‌ సర్జరీ’ ఉపయోగపడుతుంది. స్తంభన లోపం గుర్తించేదెలా?
శృంగారంపై ఆసక్తి తగ్గటం (లిబిడో లాస్‌) అనేది వేరే సమస్య. అలాగే శీఘ్రంగా స్ఖలనమైపోవటమన్నదీ వేరే సమస్య. స్తంభన సమస్య వీటికి భిన్నమైనది. పురుషుడు తాను కోరుకున్నప్పడు అంగం గట్టిపడకపోవటం, ఒకవేళ గట్టిపడినా చాలా కొద్దిసేపే స్తంభించి ఉండటాన్ని స్తంభన లోపం అనుకోవచ్చు. ఒకప్పుడు అంగస్తంభన లోపానికి మానసిక సమస్యలే ఎక్కువగా కారణమవుతాయని భావించేవారుగానీ ఎక్కువభాగం వీరిలో శారీరక సమస్యలే కారణమవుతున్నాయని ఇప్పుడు వైద్య రంగం స్పష్టంగా గుర్తించింది. కాబట్టి అసలు స్తంభన లోపం ఉందా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు వైద్యులు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. వీటిలో ప్రధానంగా రక్తనాళాలు, నాడులు, హార్మోన్ల పని తీరు ఎలా ఉందో పరీక్షిస్తారు.
** స్తంభన సామర్ధ్యానికి రిజిస్కాన్‌, రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు కావెర్నోసోమెట్రీ పరీక్షలు ఉపకరిస్తాయి. పీనైల్‌ డాప్లర్‌ ఎవాల్యుయేషన్‌ ద్వారా అంగంలో రక్తనాళాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.
** రక్తపరీక్షలో టెస్టోస్టిరాన్‌, ప్రొలాక్టిన్‌ హార్మోన్ల మోతాదును తెలుసుకుంటారు. అవసరమైతే మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేస్తారు. ఇదీ ముఖ్యమే
** స్తంభన సమస్యలతో బాధితులు వచ్చినప్పుడు వైద్యులు పీనైల్‌ డాప్లర్‌ పరీక్షలో రక్తనాళాలు పూడుకున్నాయని గుర్తిస్తే.. అధిక రక్తపోటు ఉందా? కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉందా? అన్నది చూస్తారు. గుండె జబ్బు కూడా ఉందా? అన్నది తెలుసుకునేందుకు కార్డియాలజిస్ట్‌ వంటి ప్రత్యేక నిపుణుల వద్దకు పంపిస్తారు.
...................... తరువాత పేజీలో..............