అంగ స్తంభన లోపానికి కారణమవుతున్న చాలా అంశాలు.. ప్రమాదకరమైనవి!
మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, రక్తనాళాల వ్యాధుల వంటివన్నీ గుండెపోటు, పక్షవాతం వంటి పెను సమస్యలను తెచ్చిపెడతాయని తెలుసుగానీ గుండె, మెదడు వంటి వాటిని ప్రభావితం చేయటానికంటే చాలా చాలా ముందే.. అవి సున్నితమైన పురుషాంగంలోని రక్తనాళాలను, నాడులను దెబ్బతీస్తాయి. ఫలితం అంగ స్తంభన సమస్య! దీన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే గుర్తించి శ్రద్ధ తీసుకుంటే.. దాంపత్య జీవితాన్ని నిలబెట్టుకోవటమే కాదు.. గుండెపోటు, పక్షవాతం వంటి పెను సమస్యలను నివారించుకోవటం కూడా సాధ్యపడుతుందని ఇప్పుడు వైద్య ప్రపంచం స్పష్టంగా గుర్తించింది
లోపం ఎక్కడ? .. వూబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి అంగస్తంభన లోపం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వీటికి పొగ, మద్యం వంటి అలవాట్లు... శారీరక శ్రమ లేకపోవటం, జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు ఎక్కువెక్కువ తింటుండటం... వంటి జీవనశైలి సమస్యలు కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది. మన భారతీయులకు జన్యుపరంగానే మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వాటికి ఈ అస్తవ్యస్తమైన జీవనశైలి, అలవాట్లు కూడా తోడయ్యే సరికి.. రకరకాల జబ్బులు చుట్టుముడుతున్నాయి. ఆ ప్రభావం అంగ స్తంభన పైనా పడుతోంది. ఫలితంగానే దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇప్పుడు మధ్యవయసులోనే స్తంభన లోపాలతో తీవ్రంగా మథనపడుతున్నారు. వాస్తవానికి మధుమేహం, హైబీపీ వంటివాటికి సరైన చికిత్స తీసుకుంటుంటే దుష్ప్రభావాల బారిన పడకుండా చూసుకోవచ్చు. కానీ అంగస్తంభన లోపంతో బాధపడే వారిలో చాలామంది పరిస్థితి ముదిరిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తున్నారు. అప్పటికే సమస్య ముదిరిపోయి ఉంటోంది. ఫలితంగా దాంపత్య జీవితమే కాదు.. సామాజికంగా కూడా ఎంతో నష్టం జరుగుతోంది.
మధుమేహం:మధుమేహం చాలా రకాలుగా అంగస్తంభన లోపానికి కారణమవుతుంది. మధుమేహం కారణంగా శరీరంలోని పెద్ద రక్తనాళాలే కాదు చిన్న రక్తనాళాలూ దెబ్బతింటాయి. దీన్నే ‘మైక్రోయాంజియోపతి’ అంటారు. ఫలితంగా శరీరంలోని అవయవాలకు కావలసినంత రక్త సరఫరా లభించదు. అంగస్తంభనకు మూలమైనది, అత్యంత కీలకమైనది ఈ రక్త సరఫరానే. పురుషాంగానికి రక్తసరఫరా బాగుండి, అది రక్తంతో నిండితేనే అసలు స్తంభన సాధ్యమవుతుంది. అందుకే మధుమేహం కారణంగా రక్తనాళాలు దెబ్బతింటే స్తంభన సమస్య తలెత్తుతుంది.
............తరువాత పేజీలో..............