చెర జలపాతం కూడా ప్రసిద్ధి చెందింది. ఈ జలపాతం పక్కనే పార్కు కూడా ఉంది. కొండకోనల మధ్య నుండి నీళ్లు వయ్యారంగా వంపులు తిరుగుతూ, పైనుండి కిందకు పడుతున్న నీటిని చూస్తుంటే ఆహ్లదకరంగా ఉంటుంది.
చిన్న చిన్న కొండవాగు రాళ్ల నుంచి ఎగసిపడే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు సెలవు దినాలలో, వారాంతాలలో ఎక్కువగా వస్తుంటారు. అటవీ శాఖలోని సామాజిక వన విభాగం దీనిని మరింత అందంగా రూపొందించేందుకు జలపాతం వద్ద ప్రహరీ గోడ నిర్మించారు. దీనితో పాటు వివిధ రకాలైన మొక్కలను కూడా పెంచుతున్నారు, వనదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ జలపాతం వద్దకు రోడ్డు వేయడంతో పాటు విద్యుత్‌ను కూడా ఏర్పాటు చేయబడింది. ఇక్కడ కొన్ని సినిమా షూటింగులు కూడా జరిగాయి.
ఎలా వెళ్లాలి?
ఆదిలాబాదు పట్టణం నుండి 47 కి.మీ దూరంలో ఉంది బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో, జాతీయ రహదారికి 6 కి.మీ దూరంలో, పొచ్చెర గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంది. ఇది నిర్మల్ పట్టణానికి కు 37 కి.మీ దూరంలో కలదు.