మానవ నిర్మితమైన, ఈ అద్భుతమై చెరువు కాకతీయ రాజులకు వ్యవసాయంపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం.13వ శతాబ్ధంలో కాకతీయరాజైన గణపతి దేవుని కాలంలో ఈ చెరువు నిర్మించబడినది. 85 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నిర్మించబడింది. చుట్టూ పచ్చని చెట్లతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
మంచి పర్యాటక కేంద్రం కూడా. వారాంతపు సెలవులు గడపటానికి పిల్లలకు, పెద్దలకు మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. మోటార్ బోటింగ్ సౌకర్యం కలదు. ఇక్కడ టీ, స్నాక్స్ మరియు వాటర్ బాటిల్స్ మాత్రమే అమ్మబడతాయి.
పర్యాటకులు ఇక్కడకు వచ్చేటపుడు దగ్గరలోని హనుమకొండ, వరంగల్ నుండి ఆహారం తెచ్చుకొంటే ప్రశాంతంగా రామప్ప చెరువు విహారం పూర్తి చేసుకోవచ్చు. ఉదయం 5 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ విహరించవచ్చు
తెలంగాలోని వరంగల్ జిల్లా పాకాలలో ఈ చెరువు ఉంది. వరంగల్ నుండి బస్సులలో వెళ్లవచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప గుడికి కేవలం 1 కిలో మీటర్ దూరంలోనే ఉంది. రామప్ప గుడికి, రామప్ప చెరువుకు శని, ఆదివారాలలో ప్రత్యేక బస్ లు నడుపబడుచున్నవి. ఇతర వివరాలకు ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. వరంగల్ హనుమకొండ బస్ స్టాండ్ నుండి బస్ సౌకర్యం కలదు.
State Tourism Department – +91 (040) 23450444
Warangal Tourism Officer: 0870 – 2459201