header

Warangal Fort…..వరంగల్ కోట...వరంగల్ లో పర్యాటకులను ఆకర్షించేది వరంగల్ కోట...

warangal fort Warangal Fort…..వరంగల్ కోట...వరంగల్ లో పర్యాటకులను ఆకర్షించేది వరంగల్ కోట...
వరంగల్ నగరంలో పర్యాటకులను ఆకర్షించేది వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు మచ్చుతునక ఈ కోట. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు క్రీ.శ 1199 సం. లో కోట నిర్మాణం మొదలు పెట్టాడు అతని కుమార్తె రాణి రుద్రమ దేవి 1261 సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ కోట శిధిలాలను మాత్రమే ఇక్కడ చూడవచ్చు. ఈ కోట నాలుగు పెద్ద ప్రవేశ ద్వారాలు కలిగిఉన్నది. చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నవారికి ఈ కోట సందర్శనీయమైనది. రాతిపై చెక్కబడిన సింహాల వంటి జంతువులు మరియు స్వాన్స్ వంటి పక్షులు కళాకారుల ఆ నాటి కళాకారుల పనితనానికి నిదర్శనం.
కాకతీయుల నాటి పురాతనమైన రాతి కట్టడాలతో పర్యాటకులను కనువిందు చేస్తున్న ఖిలావరంగల్‌ కోట ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత దీనిని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణా పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరంగల్‌ మధ్య కోటలోని నాలుగు కాకతీయ కళాతోరణాల మధ్య రూ.4కోట్లతో సౌండ్స్‌, లైటింగ్‌, లేజర్‌షోను ఏర్పాటు చేశారు.
ఈ కోటను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ కోటలోని శిధిలాలను మాత్రమే దర్శించవచ్చు. దేవతల విగ్రహాలు, కోట గోడలు, కోటలోని భాగాలను చూడవచ్చు. కోట చుట్టూ కట్టబడిని మట్టి గోడ, రాతి గోడను కూడా చూడవచ్చు.రుద్రమదేవి కాలంలో అసమానంగా వెలుగొందిన ఈ కోట తరువాత రుద్రమదేవి మనుమడు రెండవ ప్రతాప రుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ సేనానాయకుడు మాలిక్ కపూర్ లక్ష సైన్యంతో ఈ కోటమీదకు దండెత్తి వచ్చాడు. ఈ ఆక్రమణలో కోట నాశనం చేయబడింది. తరువాత కూడా చాలాసార్లు ఢిల్లీ సుల్తానుల ఆక్రమణలకు ఈ కోట గురైంది. అక్కడనుండి దీని ప్రాభవం కోల్పోయింది.
ఎలా వెళ్లాలి ...?
చారిత్రాత్మకమైన ఈ ఓరుగల్లు కోట వరంగల్ రైల్వేస్టేషన్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బస్ లలో లేక ఆటోలలో వెళ్లవచ్చు.