header

Warangal Tourism….. వరంగల్ పర్యాటకం...

Warangal Tourism….. వరంగల్ పర్యాటకం...
ఈ ప్రాంతం కాకతీయరాజుల సాంస్కృతిక మరియు పరిపాలన దక్షత గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి.
కాకతీయ రాజులు 12నుండి14వ శతాబ్దం A.D.వరకు వరంగల్ పరిపాలించారు. రుద్రమదేవి మనుమడు రెండవ ప్రతాప రుద్రుని యొక్క ఓటమి తరువాత, వరంగల్ ప్రాబల్యం తగ్గింది.
వరంగల్ నగరానికి గల చారిత్రక ప్రాధాన్యత, అభయారణ్యాలు మరియు అద్భుతమైన శిల్పకళతో శోభిల్లే దేవాలయాలు ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏడాది పొడవునా పర్యాటకులు తాకిడి ఎక్కువగానే ఉంటుంది.
వరంగల్ లో రెండు సంవత్సరాలకి ఒకసారి సమ్మక్క-సారక్క జాతర (సమ్మక సారలమ్మ జాతర అని కూడా అంటారు) జరుగుతుంది. ఈ జాతరకు పది మిల్లియన్ల ప్రజలను వస్తారని అంచనా. కాకతీయ రాజులను ఎదిరిస్తూ ఒక తల్లి-కూతురు జరిపిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ జాతరను జరుపుకుంటారు. ఆసియ ఖండంలో రెండవ అతిపెద్ద జాతర కూడా ఇది.
వరంగల్ నగరం ఎక్కువ ప్రజాదరణ పొందటం వలన పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన నగరంలో వసతి ముందుగానే చూసుకోవటం మంచిది.ఎండాకాలంలో వరంగల్లులో అపరిమితమైన వేడి ఉంటుంది. బడ్జెట్ హోటల్స్ నుండి ఖరీదైన హోటల్స్ వరంగల్ లో ఉన్నాయి.