header

Sumati Satakam సుమతీ శతకం

కరణము సాధై యున్నను
గరి మద ముడిగినను బాము కరవకయున్నన్
ధరదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!
తాత్పర్యం కరణం మెత్తనితనం కలిగిఉన్నా, ఏనుగు మదం విడిచినా, పాము కరవకున్నా, తేలు కుట్టకున్నా జనులు లెక్కచేయరు.
........................................................................................................
కసుగాయఁ గరచి చూచిన
మసలక తన యోగరుగాక మధురంబగునా?
పసగలుగు యువతులుండఁగఁ
బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!
తాత్పర్యం పండిన పండు తినకుండా, పచ్చికాయ కొరికితే వెంటనే వగరు రుచి కలుగుతుంది గానీ, మధురంగా ఎలా ఉంటుంది; అలాగే యౌవనం గల స్త్రీలుండగా పసి బాలికలతో కూడినచో వికటంగా ఉంటుంది. చిన్న బాలికల పొందు గూడినవాడు పశువుతో సమానుడు. .
........................................................................................................
కవి గానివాని వ్రాతయు.
నవరసభావములు లేని నాతులవలపున్.
దవిలి చని పంది నేయని.
విధధాయుధకౌశలంబు వృధరా సుమతీ! .
తాత్పర్యం కవిత్వ శక్తిలేనివాడు వ్రాసిన వ్రాత, నవరసాల అనుభవంలేని స్త్రీలయొక్క మోహం, వెంబడించి పరుగెత్తి పందిని కొట్టలేనటువంటివాని నానా విధాయుధాల నేర్పరితనం వ్యర్థాలు. .
........................................................................................................
కాదుసుమీ దుస్సంగతి.
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్, .
వాదుసుమీ యప్పిచ్చుట.
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ! .
తాత్పర్యం దుర్జన స్నేహం మంచిది కాదు. కీర్తి సంపాదించిన తరువాత తొలగిపోదు. అప్పునిచ్చుట కలహానికి మూలం. స్త్రీలకు కొంచెమైనా ప్రేమ ఉండదు. .
........................................................................................................
కాముకుడు దనిసి విడిచినఁ.
కోమలిఁ బరవిటుఁడు గవయఁ .
గోరుటయెల్లన్.
బ్రేమమునఁ జెఱుకు పిప్పికిఁ.
జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ! .
తాత్పర్యం కాముకుడు తాను తృప్తిపడే వరకూ అనుభవించి విడిచిన స్త్రీని మరొక విటగాడనుభవించగోరుట, చెరుకురసం పీల్చుకొనగా మిగిలిన పిప్పిని చీమలు ఆశతో ముసురుకొన్నట్లు ఉపయోగంలేనిదిగా ఉంటుంది.
........................................................................................................
కారణము లేని నగవునుఁ.
బేరణములేని లేమ పృథివీ స్థలిలోఁ.
బూరణములేని బూరెయు.
వీరణములులేని పెండ్లి, వృధరా సుమతీ! .
తాత్పర్యం కారణంలేని నవ్వుకి, రవిక లేక స్త్రీకి, పూరణంలేని బూరెకి, వాయిద్యాలు లేని పెళ్ళికి గౌరవం ఉండదు. ..
........................................................................................................
కులకాంతతోఁడ నెప్పుడుఁ..
గలహింపకుఁ వట్టితప్పు ఘటియింపకుమీ..
కలకంఠ కంటి కన్నీ..
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ! ..
తాత్పర్యం భార్యతో ఎప్పుడూ జగడమాడరాదు, లేని తప్పులు మోపరాదు. పతివ్రతైన స్త్రీ కంటినీరు ఇంట పడితే, ఆ ఇంటిలో సంపద వుండదు. ........................................................................................................
కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!
తాత్పర్యం స్నేహం గల దినాలలో ఎన్నడూ తప్పులు కనపడవు. ఆ స్నేహం విరోధమైతే ఒప్పులే తప్పులుగా కనిపిస్తాయి. ..
........................................................................................................
కొంచెపు నరుసంగతిచే ..
నంచితముఁగ గీడువచ్చు నది యెట్లన్నన్..
గించిత్తు నల్లి కఱచిన..
మంచమునకుఁ బెట్లు వచ్చు మహిలో సుమతీ! ..
తాత్పర్యం చిన్న నల్లి కరిస్తే మంచానికే విధంగా దెబ్బలు కలుగుతాయో, అలాగే నీచునితో స్నేహం చేస్తే కీడు కలుగుతుంది. ..
........................................................................................................
కొక్కోక మెల్ల జదివిన
చక్కనివాఁసైన రాజ చంద్రుండైనన్ ..
మిక్కిలి రొక్కము నీయక..
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ! ..
తాత్పర్యం రతిశాస్త్రమంతా చదివినవాడైనా, అందం గలవాడైనా, రాజులలో శ్రేష్టుడైనా, మిక్కిలి ధనమీయకుండా వేశ్య లభించదు. ..
........................................................................................................
కొఱగాని కొడుకు పుట్టినఁ..
గొఱగామియెగాదు తండ్రి ..
గుణములఁజెఱచున్..
జెఱకుతుద వెన్ను పుట్టినఁ..
జెఱ్కునఁ తీపెల్ల జెరచు సిద్ధము సుమతీ! ..
తాత్పర్యం చెరకుకొనకు వెన్నుపుట్టి ఆ చెరకులోని తియ్యదనమంతా ఎలా పాడుచేస్తుందో, అలాగే నిష్ప్రయోజకుడైన కొడుకు పుడితే వాడు నిష్ప్రయోజకుడవటమేగాక తండ్రి యొక్క మంచి గుణాలు కూడా పాడుచేస్తాడు. ..
........................................................................................................
కోమలి విశ్వాసం బునూ ..
బాములతో జెలిమిఁ యన్య భామల వలపున్, ..
వేముల తియ్యదనంబును, ..
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ! ..
తాత్పర్యం స్త్రీలయొక్క నమ్మకం, పాములతో స్నేహం, పరస్త్రీల యొక్క మోహం, వేపచెట్టు తియ్యదనం, రాజుల విశ్వాసానికి కల్లలు ........................................................................................................
గడనగల మగనిఁ జూచిన..
నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలోఁ..
గడనుడుగు మగనిఁజూచిన..
నడపీనుగు వచ్చెననుచు నగుదురు సుమతీ! ..
తాత్పర్యం స్త్రీలు సంపాదన గల పతిని చూసి, అడుగులకు క్రింద వస్త్రపు మడతలు వేసినట్లు తమలో భావిస్తూ గౌరవిస్తారు. సంపాదన లేని పతిని చూస్తే, నడిచే పీనుగుగా తమలో భావిస్తూ పరిహాసం చేస్తారు. ..
........................................................................................................
చింతింపకు కడచిన పని..
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో ..
నంతఃపుర కాంతలతో ..
మంతనముల మానుమిదియె మతముర సుమతీ! ..
తాత్పర్యం జరిగిపోయిన పనికి విచారించకు. స్త్రీలు ప్రేమిస్తారని నమ్మకు. రాణివాస స్త్రీలతో రహస్య ఆలోచనలు చేయకు. ఇదే మంచి నడవడి సుమా! ..
........................................................................................................
చీమలు పెట్టిన పుట్టలు..
పాముల కిరువైన యట్లు పామరుఁడుదగన్..
హేమంబుఁ గూడఁ బెట్టిన..
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ! ..
తాత్పర్యం చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైన విధంగానే, లోభి దాచిన ధనం రాజుల పాలవుతుంది..
........................................................................................................
చుట్టములు గానివారలు..
చుట్టములముఁ నీకటంచు సొంపుదలిర్పన్ నెట్టుకొని యాశ్రయింతురు..
గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ! ..
తాత్పర్యం బంధువులుకాని వారు సహితం ధనం కలిగినపుడు, నీకు మేము చుట్టాలమని ఉల్లాసంతో బలవంతంగా వచ్చి మిగుల దృఢంగా ఆశ్రయిస్తారు. ..
........................................................................................................
చేతులకు తొడవు దానము..
భూతలనాథులకుఁ దొడవు బొంకమి, ధరలో, ..
నీతియె తోడ వెవ్వారికి..
నాతికి మానంబు తొడవు, నయముగ సుమతీ! ..
తాత్పర్యం చేతులకు దానం, రాజులకు అబద్ధమాడకుండటం, ధరణిలో ఎవ్వరికైనా న్యాయం, స్త్రీకి పాతివ్రత్యం అలంకారం. ..
........................................................................................................
తడవోర్వక యొడలోర్వక..
కడువేగం బడచిపడిన గార్యంబుగానే..
తడవోర్చిన నొడ లోర్చినఁ..
జెడిపోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ! ..
తాత్పర్యం ఆలస్యాన్ని, శ్రమను సహించక వెంటనే త్వరపడితే ఏ కార్యం జరగదు? ఆలస్యం, శ్రమ సహించి ఓపిక పడితే చెడిపోయిన కార్యమంతా సమకూరుతుంది. ..
........................................................................................................
తన కోపమె తన శత్రువు..
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌఁ..
తన సంతోషమె స్వర్గము..
తనదుఖఃమె నరక మండ్రు, తథ్యము సుమతీ!
తాత్పర్యం తన కోపం శత్రువులాగా భాధను, నెమ్మదితనం రక్షకునిలాగా రక్షను, కరుణ చుట్టంలాగా ఆదరమును, సంతోషం స్వర్గంలాగా సుఖాన్ని, దుఃఖం నరకంలాగా వేదనను కల్గిస్తాయని చెప్తారు. ..
........................................................................................................
తనయూరి తపసి తనమును
దనబుత్రుని విద్యపెంపుఁ దన సతి రూపున్
దన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి
తాత్పర్యం
తన గ్రామంలో చేసే తపోనిష్ఠను, తన కుమారుని విద్యావైభోగంను, తన భార్య యొక్క సౌందర్యంను, తన పెరటిలోని చెట్టు మందును, ఎటువంటి మనిషైనా పొగడడు. ..
........................................................................................................
తన కలిమి యింద్రభోగము, ..
తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్, ..
తన చావు జగత్ప్రళయము..
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ! ..
తాత్పర్యం తన భాగ్యం ఇంద్రవైభవం వంటిదిగానూ, తన పేదరికమే ప్రపంచాన గొప్ప దారిద్ర్యం వంటిదిగానూ, తన చావే యుగాంత ప్రళయం వంటిదిగానూ, తాను వలచిన స్త్రీయే చక్కదనం కలిగినటువంటిదిగానూ మనుషులెంచుతారు. ..
........................................................................................................
తనవారు లేని చోటను, ..
జన వించుక లేనిచోట జగడము చోటన్, ..
అనుమానమైన చోటను, ..
మనుజునట నిలువఁదగదు మహిలో సుమతీ! ..
తాత్పర్యం తన బంధువులులేని చోటులో, తనకు మచ్చికలేని చోటులో, తనపై అనుమాన మైన చోటులో మనుష్యుడు నిలువకూడదు. ..
........................................................................................................
తలపొడుగు ధనముఁబోసిన..
వెలయాలికి నిజములేదు వివరింపంగాఁ..
దల దడివి బాస జేఁసిన..
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ! ..
తాత్పర్యం తల పొడుగు ధనం పోసినప్పటికీ, వేశ్యా స్త్రీకి నిజం చెప్పటమనేది లేదు. తల మీద చేయి వేసుకొని ప్రమాణం చేసినా అటువంటి కాంతను నమ్మరాదు. ..
........................................................................................................
తలమాసిన, వొలుమాసినఁ, ..
వలువలు మాసిననుఁ బ్రాణ వల్లభునైనన్..
కులకాంతలైన రోఁతురు, ..
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ! ..
తాత్పర్యం ఆలోచించగా, భూమిమీద తల, శరీరం, బట్టలు మాస్తే భర్తనైనా (మంచి స్త్రీలైనప్పటికీ) అసహ్యపడటం నిజం ..
. ........................................................................................................
దగ్గర కొండెము చెప్పెడు ..
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా..
నెగ్గుఁ బ్రజ కాచరించుట..
బొగ్గులకై కల్పతరువుఁ బొడచుట సుమతీ! ..
తాత్పర్యం మంత్రి చెప్పే చాడీ మాటలకు లోబడి మంచిచెడ్డలు తెలుసుకొనక రాజు ప్రజలను హింసించడం బొగ్గుల కోసం కోరిన కోరికలిచ్చే కల్పవృక్షాన్ని నరికేసుకోవడం వంటిది.
........................................................................................................
తాననుభవింప నర్ధము ..
మానవపతి జేరు గొంత మఱి భూగతమౌ ..
గానల నీగలు గూర్చిన..
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ! ..
తాత్పర్యం నిజంగా తేనెటీగలు అడవులలో చేర్చి ఉంచిన తేనె ఇతరులకు ఎలా చేరుతుందో, అలాగే తాము అనుభవించక దాచి ఉంచిన ధనం కొంత రాజులకు చేరుతుంది, మరికొంత భూమి పాలవుతుంది. ..
........................................................................................................
ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్
దనవారి కెంతకల గిన
దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!
తాత్పర్యం ధన వంతుడైన కుబేరుడు స్నేహితుడైనప్పటికీ, ఈశ్వరుడు బిచ్చమెత్తటం సంభవించెను. కాబట్టి, తన వారికెంత సంపద ఉన్నా, తనకుపయోగపడదు. తన భాగ్యమే తనకు ఉపయోగపడును. ..
........................................................................................................
ధీరులకుఁ జేయు మేలది..
సారంబగు నారికేళ సలిలము భంగిన్..
గౌరవమును మఱి మీఁదట..
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ! ..
తాత్పర్యం కొబ్బరిచెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను యిచ్చును. అలాగే బుద్ధిమంతులకు చేసిన ఉపకారం మర్యాదను, తరువాత మిక్కిలి సుఖాలను కల్గిస్తుంది. ..
........................................................................................................
తరువాత పేజీలో...................