header

Avanakshamma Temple / పద్మావతీ దేవి పూజించిన అవనాక్షమ్మ

ఈ అమ్మ ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనం గ్రామానికి కిలోమీటరు దూరంలో అరుణానది సమీపంలో ఉన్నది.
ఆకాశరాజు కులదేవత : లక్ష్మీదేవి అవతారంగా చెప్పే పద్మావతీ దేవి తండ్రి ఆకాశరాజు. వాళ్ళ కులదేవతే అవనాక్షమ్మ. ఆయనకు చాలాకాలం వరకూ సంతానం కలగలేదు. సంతానంకోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేశాటడ. ఫలితంగా పద్మావతీదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతీ దేవీ తండ్రితో సహా ప్రతిరోజూ ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసేదట.
ఈ ఆలయానికి మంగళ,శుక్ర ఆదివారాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ అమ్మవారికి పూజలు చేస్తే వివాహంకాని వారికి వివాహాం అవుతుందని, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం
జాతర : ప్రతి సంవత్సరం అమ్మవారికి 18 రోజులపాటు జాతర జరుగుతుంది. ఇది ఆగష్టు 22-26 తేదీ మధ్యలో ప్రారంభమై సెప్టెంబర్‌ 11,12 తేదీలో ముగుస్తుంది. 1967లో ఈ దేవాలయం తిరుపతి దేవస్థానం పరిధిలోనికి వచ్చింది. భక్తులకోసం రాష్ట్రపర్యాటకశాఖ వసతులు సమకూర్చింది. భక్తులు పొంగళ్ళు పెట్టుకునేందుకు వీలుగా షెడ్లు, ఇతరసౌకర్యాలు, మరుగు దొడ్లు నిర్మించారు.
ఎలా వెళ్ళాలి : అవనాక్షమ్మ ఆలయం తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే బస్సు ద్వారా నారాయణవనం చేరుకొని అక్కడ నుండి కిలోమీటరు నడిస్తే ఆలయం వస్తుంది.