తిరుమల యాత్ర అంటే తిరుమల కొండమీద శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకోవటంతో పూర్తవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ తిరుమల వెళ్ళిన వారు ముందుగా ఆదివరాహస్వామిని దర్శనం చేసుకున్నాక మాత్రమే స్వామిని దర్శించుకోవాలి. ఇది శ్రీవేంకటేశ్వరుడు వరాహస్వామికి స్వయంగా ఇచ్చిన వరం. ఆనంద నిలయం(స్వామివారి ఆలయంపేరు) లోనే చూడవలసినవి చాలా ఉన్నాయి అంతేకాదు పచ్చని లోయలు, అడుగడుగునా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే స్వామివారి ఏడు శిఖరాలు, తిరుమల చుట్టుపక్కలా ఉన్న ఆకాశగంగ, కపిలతీర్ధం, తుంబుర, కపిలతీర్ధం, పాపనాశన తీర్ధాలు.... మరియు తిరుపతి సమీపంలోనే ఉన్న పవిత్ర ఆలయాలు, శ్రీనివాస మంగాపురం, నారాయణుడి వివాహం జరిగిన నారాయణవనం, నాగులాపురం... ఇంకా ఎన్నో ఆలయాలున్నాయి. అన్నింటి గురించి వివరాలు.....